Tata Punch EV Facelift: టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్.. 468 KM రేంజ్, ధర, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ తన టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. 2023లో మొదటిసారి పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ SUVకు ఇది తొలి ప్రధాన అప్‌డేట్. తాజా డిజైన్ మార్పులు, మెరుగైన రేంజ్, అదనపు ఫీచర్లు, అలాగే లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీతో ఈ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత పోటీగా నిలవనుంది.
Details
డిజైన్ & ఫీచర్లు
కొత్త పంచ్ EVలో 360-డిగ్రీల కెమెరా, LED హెడ్‌లైట్లు, కనెక్ట్ చేసిన LED టెయిల్‌లైట్లు, కొత్తగా డిజైన్ చేసిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. అంతర్గతంగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ IRVM, సింగిల్ సన్‌రూఫ్ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. ఇంకా ప్రీమియం డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ లెథరెట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కూడా పొందుపరిచారు. కొత్తగా 3 రంగులతో కలిపి మొత్తం 7 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Details
బ్యాటరీ & పనితీరు
ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 30 kWh మరియు 40 kWh బ్యాటరీ ఎంపికలతో అందిస్తున్నారు. గరిష్టంగా 468 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మోటార్ గరిష్టంగా 8295 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే రీజెన్ మోడ్‌తో సహా పలు డ్రైవింగ్ మోడ్‌లను కూడా అందిస్తున్నారు. వేరియంట్లు & ధర కొత్త పంచ్ EV మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ S వంటి ట్రిమ్‌లలో ఈ SUV అందుబాటులో ఉంటుంది.
Details
భద్రతా ఫీచర్లు
ధర విషయానికి వస్తే, ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.69 లక్షలు కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 12.59 లక్షలు. అదనంగా BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) మోడల్ రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర నుంచి అందుబాటులో ఉంది. భద్రత పరంగా హిల్ హోల్డ్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వస్తోంది. కొత్త అప్‌డేట్స్, అధునాతన ఫీచర్లు, మెరుగైన రేంజ్‌తో టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.