
Tata Punch EV : నవంబర్‌లో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ.. ఫీచర్స్ సూపర్బ్
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారుపై కీలక సమాచారం అందించింది.
ఈ ఏడాది నవంబర్‌లోనే ఈ కారు మార్కెట్లోకి రానున్నట్లు తెలిసింది. ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాదాపు టాటా పంచ్ మాదిరిగానే ఉండనుంది.
బాడీ ప్యానెల్స్, అలాయ్ వీల్స్ డిజైన్, డైమెన్షన్స్ ఇవన్నీ టాటా పంచ్ తరహాలోనే ఉండనున్నాయి. ఈ కారు బయటివైపు, లోపలివైపు ఈవీ బ్యాడ్జెస్ ను ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ ఈవీలో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఫీచర్స్ తో పాటు 360 డిగ్రీ కెమెరా కూడా ఉండడం విశేషం.
Details
సిట్రియోన్ ఈ సీ3, ఎంజీ కోమెట్ ఈవీలతో టాటా పంచ్ ఈవీ పోటీ
టాటా పంచ్ ఈవీలో టాటా మోటర్స్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, సిగ్నేచర్ టెక్నాలజీ జిప్ ట్రాన్ ను ఉపయోగించనుంది. మార్కెట్లో సిట్రియోన్ ఈ సీ3, ఎంజీ కోమెట్ ఈవీలతో టాటా పంచ్ ఈవీ పోటీ పడనుంది.
ఇది ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ అనే మూడు వర్షన్లలో లభిస్తోంది. ఇటీవలే టాటా పంచ్ సీఎన్జీ వర్షన్ లాంచ్ అయిన విషయం తెలిసిందే.
దీని ఎక్స్ షో రూం ధర వేరియంట్ల బట్టి 7.10 లక్షల నుంచి రూ. 9.68 లక్షల వరకు ఉంది.