Page Loader
'2024 KTM 390 డ్యూక్' వర్సెస్ '2024 CFMoto 450NK' బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి 
2024 KTM 390 డ్యూక్, 2024 CFMoto 450NK బైక్స్ మధ్య తేడాలు

'2024 KTM 390 డ్యూక్' వర్సెస్ '2024 CFMoto 450NK' బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 23, 2023
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

KTM మోటార్ బైకులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. 390డ్యూక్ బైకుని 2013లో KTM లాంచ్ చేసింది. ఇప్పుడు 2024 మోడల్ KTM డ్యూక్ బైక్ వచ్చేస్తుంది. దీనికి పోటీగా మార్కెట్లో BMW G 310 R, కవాసాకి Z400 ఉన్నాయి. అలాగే వీటితో పాటు 2024 CFMoto నుండి 450NK కూడా పోటీకి వచ్చేస్తుంది. ప్రస్తుతం 2024 KTM 390 డ్యూక్, 2024 CFMoto 450NK బైక్స్ మధ్య తేడాలు చూద్దాం.

Details

17అంగుళాల అలాయ్ వీల్స్ కలిగి ఉన్న బైక్స్ 

2024 CFMoto 450NK బైక్ LED హెడ్ లైట్, LED టెయిల్ ల్యాంప్ ని కలిగి ఉంది. 17అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇటు 2024 KTM 390 డ్యూక్ లో కూడా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, LED హెడ్ లైట్, LED టెయిల్ ల్యాంప్, 17అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ రెండు బైక్ మోడల్స్ కూడా రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ కలిగి ఉన్నాయి. డ్యుయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. 2024 CFMoto 450NK బైకు, 449సీసీ సామర్థ్యంతో, 46.9hp శక్తిని కలిగి ఉండి అత్యధిక 39Nm టార్క్ఉంటుంది.

Details

6 గేర్లను కలిగిన ఉన్న రెండు బైక్ మోడల్స్ 

2024 KTM 390 బైక్, 399సీసీ సామర్థ్యం కలిగి ఉండి లిక్విడ్ కూల్ సిస్టమ్ తో సింగిల్ సిలిండర్ ని కలిగి ఉంది. 45hp శక్తితో అత్యధిక 39Nm టార్క్ ఉంటుంది. ఈ రెండు బైక్స్ కూడా 6 గేర్లు కలిగి ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లో ఈ రెండు బైక్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే 2024 CFMoto 450NK బైక్ ఇంజన్ మెరుగ్గా ఉంటుంది. ఇటు 2024 KTM 390 మంచి డిజైన్ ని కలిగి ఉంటుంది.