కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.
ఈ కొత్త స్కూటర్‌లో విలాసవంతమైన క్యాబిన్, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్, వివిధ కార్గో సదుపాయాలు ఉన్నాయి.
డీలక్స్, అల్టిమేట్ అనే 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా సీనియర్ సిటిజన్‌లు, పరిమిత పట్టణ వేగంతో ప్రయాణించే వ్యక్తుల కంపెనీ రూపొందించింది. ఇది సీనియర్ సిటిజన్‌లకు సౌకర్యవంతంగా ఉంటుంది.
దీని ఎంట్రీ-లెవల్ టెక్టస్ డీలక్స్ ధర $6,995 (సుమారు రూ. 5.79 లక్షలు), టెక్టస్ అల్టిమేట్ ధర $8,999 (సుమారు రూ. 7.45 లక్షలు).
బైక్
ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 160 కిలోమీటర్ల వరకు ప్రయాణం
టెక్టస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2kW ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 32 కి.మీ వరకు ఉంటుంది.
ఇది 2.4kWh (డీలక్స్ ట్రిమ్) లేదా 5.4kWh (అల్టిమేట్ వేరియంట్) లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. టెక్టస్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల కార్గో ఎంపికలు కిరాణా షాపింగ్‌కు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
దీని లభ్యతకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో GPS ట్రాకింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బ్యాకప్ కెమెరా వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.