LOADING...
Kia Sonet : పనోరమిక్ సన్‌రూఫ్‌తో నూతన కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!
పనోరమిక్ సన్‌రూఫ్‌తో నూతన కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

Kia Sonet : పనోరమిక్ సన్‌రూఫ్‌తో నూతన కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కియాకు చెందిన ప్రముఖ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కియా సోనెట్ త్వరలోనే సెకండ్ జనరేషన్ మోడల్‌తో మార్కెట్‌లోకి రానుంది. 2020లో భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన సోనెట్, అప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతూ ఈ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచింది. మూడేళ్ల క్రితం ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ వచ్చినప్పటికీ, గత ఆరేళ్లుగా ఈ మోడల్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. అయితే ప్రస్తుతం సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో, కియా తన రెండో తరం సోనెట్‌ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ కొత్త సోనెట్‌కు సంబంధించిన టెస్ట్ మ్యూల్స్ తొలిసారిగా రోడ్లపై కనిపించడంతో కీలక వివరాలు బయటకు వచ్చాయి.

వివరాలు

సెల్టోస్ తరహా డిజైన్.. పనోరమిక్ సన్‌రూఫ్ హైలైట్

టెస్టింగ్ సమయంలో వాహనాన్ని పూర్తిగా కవర్ చేసినప్పటికీ, కొన్ని డిజైన్ అంశాలు స్పష్టంగా కనిపించాయి. కొత్త సోనెట్ డిజైన్‌లోకియా సెల్టోస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుభాగంలో వెడల్పైన గ్రిల్, దానికి అనుసంధానమైన హెడ్‌ల్యాంప్స్, పైభాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఈ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. బంపర్ డిజైన్‌ను మరింత క్లీన్‌గా రూపొందించగా, బోనెట్ మాత్రం ప్రస్తుత మోడల్ మాదిరిగానే అగ్రెసివ్ స్టైల్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈసారి పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

వివరాలు

కొత్త ప్లాట్‌ఫారమ్.. మెరుగైన భద్రత

రెండో తరం సోనెట్‌ను కియా తన అధునాతన 'కే1' ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఇదే ప్లాట్‌ఫారమ్‌ను కియా సిరోస్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ వల్ల వీల్‌బేస్ పెరిగి, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు మరింత లెగ్ స్పేస్ లభించే అవకాశం ఉంది. భద్రత పరంగా కూడా కియా ఈసారి మరింత ఫోకస్ పెడుతోంది. సైరోస్, వెన్యూ మోడళ్లు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించిన నేపథ్యంలో, కొత్త సోనెట్ కూడా అదే స్థాయి భద్రతా ప్రమాణాలతో రానుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు

ప్రీమియం ఇంటీరియర్.. అడాస్ ఫీచర్లు

కొత్త సోనెట్ ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. సైరోస్, సెల్టోస్ తరహాలో మినిమలిస్టిక్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో 12.3 ఇంచ్ భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈసారి కియా లెవల్-2 అడాస్ (ADAS) ఫీచర్లను కూడా సోనెట్‌లో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. దీంతో డ్రైవింగ్ అనుభవం మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా మారనుంది.

Advertisement

వివరాలు

ఇంజిన్ ఆప్షన్లు.. హైబ్రిడ్ వెర్షన్ కూడా

ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కియా కొనసాగించే అవకాశం ఉంది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హైబ్రిడ్ మోడల్ 2029 నాటికి మాత్రమే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కొత్త కియా సోనెట్ 2027 ప్రారంభంలో గ్లోబల్ డెబ్యూ ఇచ్చే అవకాశముంది. అప్పటివరకు ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement