Honda Amaze: హోండా అమేజ్ కొత్త వెర్షన్.. డిసెంబర్ 4న లాంచ్‌కు సిద్ధం
హోండా కారు కంపెనీ అమేజ్ 2024ను డిసెంబర్ 4న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అయితే లాంచ్‌కి ముందే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ అనధికారికంగా ప్రారంభమయ్యాయని సమాచారం. కొన్ని డీలర్లు ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారట. కానీ దీనిపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మోడల్ ప్రత్యేకతలు, ఫీచర్లు, భద్రతా అంశాలు, ధర, పోటీ వివరాలపై ఓ లుక్కేద్దాం. కొత్త డబుల్ బీమ్ ఎల్ఈడీ లైట్లు ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి. ఫ్రంట్ గ్రిల్, బంపర్‌ను ఆధునికతకు అనుగుణంగా తీర్చిదిద్దారు. షార్ప్ సైడ్ వ్యూ మిర్రర్లు కొత్త డిజైన్‌కు ప్రత్యేకతను జోడిస్తాయి.
పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ వెర్షన్
డిజిటల్ ఏసీ ప్యానెల్‌తో పాటు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్‌పై మల్టీ ఫంక్షన్ స్విచ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ వెర్షన్ కూడా విడుదల కానుంది. ఈ కొత్త మోడల్ ధర లాంచ్ సమయంలోనే ప్రకటిస్తారు. ప్రస్తుత హోండా అమేజ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.19 లక్షల నుండి రూ.9.13 లక్షల వరకు ఉంది. కొత్త వెర్షన్ ధర కూడా ఈ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది. మారుతి డిజైర్ 2024, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు అమేజ్ గట్టి పోటీనివ్వనుంది.