Kode89: కేవలం 8 కార్లే.. జపాన్‌కు చెందిన ఈ సూపర్‌కార్ డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల డిజైనర్ కెన్ఎకుయామా కార్స్ తన సరికొత్త సూపర్‌కార్ Kode89ను ఆవిష్కరించింది. అమెరికాలోని పెబుల్ బీచ్ కాంకోర్స్ డి ఎలిగాన్స్‌లో మాంటెరీ కార్ వీక్ సందర్భంగా ఈ కారును తొలిసారి ప్రదర్శించారు. ఆధునిక సూపర్‌కార్లకు భిన్నంగా రెట్రో, ఫ్యూచరిస్టిక్ డిజైన్ అంశాలను కలిపి Kode89ను రూపొందించారు. పొడవైన బాడీ, వెడల్పాటి స్టాన్స్‌తో కనిపించే ఈ కారులో భారీ ఏరోడైనమిక్ డిజైన్లకు బదులుగా సింపుల్, క్లీన్గా కనిపించే ఆకృతికి ప్రాధాన్యం ఇచ్చారు. Kode89 పొడవు 181.5 అంగుళాలు, వెడల్పు 78.6 అంగుళాలు కాగా.. ఎత్తు కేవలం 44.8 అంగుళాలు మాత్రమే. అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ఛాసిస్‌ను ఇందులో ఉపయోగించారు.
వివరాలు
కేవలం 8 యూనిట్లే.. ఇప్పటికే రెండు Kode89 కార్లు అమ్ముడుపోయాయి
కారు మధ్య భాగంలో V12 ఇంజిన్‌ను అమర్చారు. 5.4 లీటర్ల ఇంజిన్ కలిగిన బేస్ వేరియంట్ 7,000 ఆర్‌పీఎం వద్ద 540 హెచ్‌పీ పవర్‌ను, గరిష్ఠంగా 570 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక మరింత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ వెర్షన్‌లో పెద్ద ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు. ఇది సుమారు 750 హెచ్‌పీ పవర్‌ను అందించే అవకాశం ఉంది.
ఈ సూపర్‌కార్ ఉత్పత్తిని కెన్ఎకుయామా కార్స్ కేవలం 8 యూనిట్లకే పరిమితం చేసింది.
దీంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎన్నో ఖరీదైన సూపర్‌కార్ల కంటే Kode89 మరింత ప్రత్యేకంగా నిలవనుంది.
తొలి కారును పెబుల్ బీచ్‌లో ప్రదర్శించగా.. ఈ ఏడాది తయారు చేయనున్న రెండు యూనిట్లు ఇప్పటికే అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా Kode89.. ఫెరారీ ఎన్జో డిజైనర్ సృష్టి
Kode89 కొనుగోలుదారులకు కారును తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇందుకోసం కెన్ఎకుయామా కార్స్ ప్రత్యేక కార్ కన్సియర్జ్‌తో కలిసి పనిచేయనుంది.
పూర్తిగా తక్కువ బరువుతో,రేసింగ్‌కు అనుకూలంగా ఉండే స్ట్రిప్డ్‌డౌన్ వెర్షన్ నుంచి అత్యంత విలాసవంతమైన వెర్షన్ వరకు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కారును రూపొందించుకోవచ్చు.
ఈ కారు వెనుక ఉన్న కెన్ఎకుయామాకు ఆటోమొబైల్ డిజైన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన పినిన్‌ఫరీనా సంస్థతో కలిసి పనిచేశారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన స్పోర్ట్స్‌కార్లలో ఒకటైన ఫెరారీ ఎన్జో డిజైన్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
వివరాలు
ఫెరారీ, లంబోర్గినీకి భిన్నంగా.. ప్రత్యేకతే లక్ష్యంగా Kode89 సూపర్‌కార్
జపాన్‌లో సొంత కోచ్‌బిల్డింగ్ కంపెనీని ప్రారంభించిన తర్వాత లంబోర్గినీ అవెంటడార్ ఆధారంగా Kode 0,ఫెరారీ 599ఆధారంగా Kode 57 వంటి ప్రత్యేక కార్లను రూపొందించారు.
ఆధునిక సూపర్‌కార్లతో పోలిస్తే Kode89లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ V12 ఇంజిన్,6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్,అల్యూమినియం ఛాసిస్, కార్బన్‌ఫైబర్ బాడీ వర్క్‌ను ఇందులో ఉపయోగించారు.
తక్కువ బరువుతో రూపొందించినప్పటికీ.. కేవలం 8కార్లే తయారవుతుండటంతో ఈ సూపర్‌కార్ రోడ్లపై తరచుగా కనిపించే అవకాశం లేదు.
ఫెరారీ లేదా లంబోర్గినీ తరహాలో పెద్ద సంఖ్యలో కార్లను తయారు చేసి పోటీ పడటం కెన్ఎకుయామా లక్ష్యం కాదు.
ఇతర పెద్ద కార్ల కంపెనీలు సులభంగా తయారు చేయలేని విధంగా ప్రత్యేకమైన, అరుదైన సూపర్‌కార్‌ను రూపొందించడమే తమ ఉద్దేశమని సంస్థ చెబుతోంది.