LOADING...
రూ.5 లక్షలలోపు ఇండియాలో లాంచ్ కానున్న టాప్-3 బైక్స్ ఇవే
2024లో ఇండియాలో లాంచ్ కానున్న టాప్-3 బైక్స్ ఇవే!

రూ.5 లక్షలలోపు ఇండియాలో లాంచ్ కానున్న టాప్-3 బైక్స్ ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 01, 2024
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బైకు ప్రియులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఇండియాలో 5 లక్షల లోపు ఉండే టాప్ 3 బైక్స్ లాంచ్ కానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్, హుస్క్ వర్నా, కేటీఎం లాంటి టాప్ కంపెనీలు 2024లో తమ లేటెస్ట్ బైక్ లను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2024లో షాట్‌గన్ 650, స్క్రాంబ్లర్ 650 అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వాటిలో ఎన్‌జీ 650 సూపర్ మెటోర్ 650 ప్లాగ్ షిప్ క్రూయిజర్ కింది స్లాట్ చేసి ఉంటుంది. షాట్‌గన్ 650 ప్రారంభ ధర రూ. 3.5 లక్షలు ఉండనుంది.

Details

షార్ప్, అగ్రెసివ్ లుక్ తో కేటీఎం 390

స్క్రాంబ్లర్ 650లో రిబ్బెడ్ సీట్, ఎత్తైన హ్యాండిల్‌బార్, ఓవల్ సైడ్ ప్యానెల్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. KTM 390 డ్యూక్ 399cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అది షార్ప్, అగ్రెసివ్ లుక్‌తో మరింత ఆకర్షణీయంగా కన్పిస్తోంది. 5 హెచ్‌పీ పవర్, 39 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర 3.8 లక్షలు ఉండనుంది. Husqvarna Svartpilen 401 2024 మధ్య నాటికి ఇండియాలో లాంచ్ కానుంది. ఈ బైక్ ప్రస్తుత వర్షెన్ కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. రూ. 3.3 లక్షలుగా ఉంది.