LOADING...
Triumph :స్టైలిష్‌గా బైక్ రైడ్.. పురుషుల ఆరోగ్యానికి మద్దతు.. డీజీఆర్ 13వ ఎడిషన్‌కు ట్రయంఫ్ శ్రీకారం
డీజీఆర్ 13వ ఎడిషన్‌కు ట్రయంఫ్ శ్రీకారం

Triumph :స్టైలిష్‌గా బైక్ రైడ్.. పురుషుల ఆరోగ్యానికి మద్దతు.. డీజీఆర్ 13వ ఎడిషన్‌కు ట్రయంఫ్ శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియాలో 'డిస్టింగ్విష్డ్ జెంటిల్మెన్స్ రైడ్' (DGR) 13వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక చారిటీ బైక్ రైడ్ మే 17, 2026 ఆదివారం దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో జరగనుంది. పురుషుల మానసిక ఆరోగ్యం, ప్రోస్టేట్ క్యాన్సర్ పరిశోధనకు మద్దతుగా నిర్వహించే ఈ కార్యక్రమంలో క్లాసిక్, మోడర్న్-క్లాసిక్ బైక్‌లపై రైడర్లు ఫార్మల్ డ్రెస్సింగ్‌తో పాల్గొంటారు. ట్రయంఫ్ బైక్ యజమానులే కాకుండా ఇతర బ్రాండ్ బైక్ రైడర్లు కూడా ఇందులో పాల్గొనవచ్చని సంస్థ తెలిపింది.

వివరాలు 

250 డాలర్లు సేకరించిన వారికి ప్రత్యేక బహుమతులు

ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ రైడ్ నిర్వహించనున్నారు. గత ఏడాది భారీ స్పందన రావడంతో ఈసారి మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో నిర్వహించే ఈ డీజీఆర్ కార్యక్రమానికి ట్రయంఫ్ చాలా కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పాల్గొనే రైడర్లు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫండ్‌రైజింగ్‌లో భాగమవ్వొచ్చు. కనీసం 250 డాలర్లు సేకరించిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా అందించనున్నారు.

వివరాలు 

బైకింగ్ కల్చర్ ఈవెంట్‌ 

2012లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా రైడర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. భారతదేశంలో కూడా ఇది ప్రత్యేక బైకింగ్ కల్చర్ ఈవెంట్‌గా మారింది. దేశవ్యాప్తంగా ట్రయంఫ్ బైక్‌ల సంఖ్య లక్ష దాటిన నేపథ్యంలో ఈ ఏడాది కార్యక్రమం తమకు మరింత ప్రత్యేకమని సంస్థ తెలిపింది. క్లాసిక్ లేదా మోడర్న్-క్లాసిక్ బైక్ ఉన్న ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. రైడర్లు సూట్లు, ట్వీడ్ డ్రెస్సులతో స్టైలిష్‌గా రైడ్‌లో పాల్గొననున్నారు.

Advertisement

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా రైడర్లను ఒకచోట చేర్చే కార్యక్రమం

ఈ సందర్భంగా బజాజ్ ఆటో ప్రో-బైకింగ్ విభాగం అధ్యక్షుడు Manik Nangia మాట్లాడుతూ.. "డిస్టింగ్విష్డ్ జెంటిల్మెన్స్ రైడ్ అనేది కేవలం బైక్ రైడ్ మాత్రమే కాదు.. ఇది ఒక గ్లోబల్ మూవ్‌మెంట్. మంచి లక్ష్యం కోసం ప్రపంచవ్యాప్తంగా రైడర్లను ఒకచోట చేర్చే కార్యక్రమం. భారత రోడ్లపై లక్ష ట్రయంఫ్ బైక్‌లు చేరిన ఈ సమయంలో ఈ ఏడాది డీజీఆర్ మాకు మరింత ప్రత్యేకం" అని తెలిపారు.

Advertisement