Page Loader
Triumph Speed T4: భారతదేశంలో కొత్త బాజా ఆరెంజ్ కలర్ వేరియంట్ స్పీడ్ T4 ని విడుదల చేసిన ట్రయంఫ్..ఫీచర్స్,ధరలు ఇలా..!  
భారతదేశంలో కొత్త బాజా ఆరెంజ్ కలర్ వేరియంట్ స్పీడ్ T4 ని విడుదల చేసిన ట్రయంఫ్

Triumph Speed T4: భారతదేశంలో కొత్త బాజా ఆరెంజ్ కలర్ వేరియంట్ స్పీడ్ T4 ని విడుదల చేసిన ట్రయంఫ్..ఫీచర్స్,ధరలు ఇలా..!  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, భారత మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, క్లాసిక్ ఫీచర్లు వంటి అంశాలతో యువతను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ, ఇటీవల తమ ప్రముఖ మోడల్ Speed T4 బైక్‌కు కొత్త రంగును పరిచయం చేసింది. ట్రయంఫ్ సంస్థ తాజాగా బాజా ఆరెంజ్ (Baja Orange) అనే కొత్త కలర్ వేరియంట్‌ను ఈ మోడల్‌లో విడుదల చేసింది. అయితే, ఈ కొత్త కలర్ వేరియంట్‌లో డిజైన్ లేదా మెకానికల్ విభాగాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది కేవలం లుక్ పరమైన (విజువల్) నవీకరణ మాత్రమే.

వివరాలు 

ఇంజిన్ & పవర్‌ట్రెయిన్ వివరాలు: 

ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్‌ లో 398.15 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ సహాయంతో పనిచేస్తుంది.ఈ ఇంజిన్ 30.6 హెచ్‌పీ శక్తిని @7,000 RPM వద్ద ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 36 Nm టార్క్‌ను @5,000 RPM వద్ద విడుదల చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్లు ఈ బైక్‌ను నగర ప్రయాణాల్లోనూ, ఓపెన్ రోడ్ రైడింగ్‌లోనూ సమర్థవంతంగా నడిపించేలా చేస్తాయి.

వివరాలు 

ముఖ్యమైన ఫీచర్లు: 

ఈ బైక్‌లో యువత ఆధునిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ DRLs, రియర్ లైటింగ్ సిగ్నేచర్ వంటివి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, అనలాగ్ స్పీడోమీటర్‌తో కలిపిన మల్టీఫంక్షనల్ LCD స్క్రీన్, యుఎస్‌బీ చార్జింగ్ పోర్ట్, డ్యూయల్ చానెల్ ABS వంటి ఫీచర్లు బైక్‌కు అదనపు ఆకర్షణను ఇస్తాయి. నేయో-రెట్రో డిజైన్‌తో కూడిన బాడీ లుక్ ఈ బైక్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ టచ్‌ను ఇస్తుంది. కొత్తగా పరిచయమైన బాజా ఆరెంజ్ కలర్ తో పాటు, ఇప్పుడు ట్రయంఫ్ స్పీడ్ T4 మొత్తం ఐదు రంగుల్లో లభిస్తోంది. అవి:

వివరాలు 

ధర & మార్కెట్ పోటీ: 

కాస్పియన్ బ్లూ & పర్ల్ మెటాలిక్ వైట్ లావా రెడ్ గ్లోస్ & పర్ల్ మెటాలిక్ వైట్ ఫాంటమ్ బ్లాక్ & పర్ల్ మెటాలిక్ వైట్ ఫాంటమ్ బ్లాక్ & స్టోర్మ్ గ్రే బాజా ఆరెంజ్ (కొత్త రంగు) ఈ బైక్‌ రూ. 1.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ ధరతో ట్రయంఫ్ Speed T4 బైక్ భారత మార్కెట్లో ఉన్న పలు క్రూయిజర్ మోడళ్లకు గట్టి పోటిగా నిలుస్తోంది. ట్రయంఫ్ సంస్థ తన క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లు మరియు పోటీలో నిలిచే ధరలతో యువతలో విశేష గుర్తింపు పొందుతోంది.

వివరాలు 

బైక్ ప్రేమికులకు కొత్త ఆప్షన్‌

ఇటీవలి 'బాజా ఆరెంజ్' కలర్ వేరియంట్, స్టైలింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చే బైక్ ప్రేమికులకు కొత్త ఆప్షన్‌ను అందించగా, కంపెనీ నుండి త్వరలో మరిన్ని కలర్ వేరియంట్లు, కొత్త మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది.