Loading...
Triumph Street Triple 798 Moto2: పవర్‌ పెరిగింది.. బరువు తగ్గింది.. ట్రయంఫ్‌ కొత్త బైక్‌ వచ్చేసింది
పవర్‌ పెరిగింది.. బరువు తగ్గింది.. ట్రయంఫ్‌ కొత్త బైక్‌ వచ్చేసింది

Triumph Street Triple 798 Moto2: పవర్‌ పెరిగింది.. బరువు తగ్గింది.. ట్రయంఫ్‌ కొత్త బైక్‌ వచ్చేసింది

వ్రాసిన వారు Balachander Sharma
Nov 28, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ కొత్త బైక్‌లో 798 సీసీ మూడు సిలిండర్ల ఇంజిన్‌ ఉంది. ఇది 133 బీహెచ్‌పీ పవర్‌, 86 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత 765 మోటో2 ఎడిషన్‌లో 128 బీహెచ్‌పీ, 80 ఎన్ఎం టార్క్‌ మాత్రమే ఉండేది. అంటే కొత్త మోడల్‌లో పవర్‌తో పాటు టార్క్‌ కూడా పెరిగింది. ఇంజిన్‌లో పెద్ద వాల్వ్‌లు, మెరుగైన కంబషన్‌ ఛాంబర్‌, అధిక కంప్రెషన్‌ రేషియో వంటి మార్పులు చేశారు. 2027 నుంచి మోటో2 ఛాంపియన్‌షిప్‌లో ఉపయోగించనున్న ఇంజిన్‌ అభివృద్ధితోనూ దీనికి సంబంధం ఉంది.

Details

సస్పెన్షన్‌, బ్రేకింగ్‌లో రేసింగ్‌ టచ్

బైక్‌ నియంత్రణ మెరుగుపడేందుకు ముందు భాగంలో 43 ఎంఎం ఓహ్లిన్స్‌ ఎన్‌ఐఎక్స్‌30 అడ్జస్టబుల్‌ ఫోర్కులు ఇచ్చారు.

వెనుకవైపు ఓహ్లిన్స్‌ ఎస్టీఎక్స్‌46 షాక్‌ అబ్జార్బర్‌ ఉంటుంది. బ్రేకింగ్‌ కోసం బ్రెంబో హైప్యూర్‌ నాలుగు పిస్టన్‌ కాలిపర్లు, 310 ఎంఎం డ్యూయల్‌ డిస్కులను అమర్చారు.

క్లిప్‌-ఆన్‌ హ్యాండిల్‌బార్లు, వెనుకకు జరిపిన ఫుట్‌పెగ్స్‌ కారణంగా రైడర్‌ మరింత స్పోర్టీ రైడింగ్‌ పొజిషన్‌లో కూర్చోవచ్చు.

Details

7 కిలోల బరువు తగ్గింపు

ఈ బైక్‌ వెట్‌ వెయిట్‌ 181 కిలోలు. 798 ఆర్ఎస్‌ కంటే 2 కిలోలు, పాత 765 మోటో2 ఎడిషన్‌ కంటే 7 కిలోలు తక్కువ.

లిథియం అయాన్‌ బ్యాటరీ, కార్బన్‌ ఫైబర్‌ భాగాల వినియోగంతో ఈ బరువు తగ్గించారు.

హెడ్‌లైట్‌ చుట్టూ ఉండే భాగం, ఫ్రంట్‌ మడ్‌గార్డ్‌, హీల్‌ గార్డులు, బెల్లీ పాన్‌ వంటి భాగాల్లో కార్బన్‌ ఫైబర్‌ను ఉపయోగించారు.

మొత్తం మీద ట్రాక్‌పై వేగంగా మలుపులు తీసుకునేందుకు వీలుగా బైక్‌ నిర్మాణాన్ని మెరుగుపరిచారు.

ADVERTISEMENT

Details

7 ఇంచుల టచ్‌స్క్రీన్‌.. ఆధునిక ఫీచర్లు

రైడర్ల కోసం ఏడు రైడింగ్‌ మోడ్‌లు, లాంచ్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఫ్రంట్‌ వీల్‌ లిఫ్ట్‌ కంట్రోల్‌ అందించారు.

7 ఇంచుల టచ్‌స్క్రీన్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లేకు వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సపోర్ట్‌ ఉంది.

క్రూయిజ్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ లైట్లు, క్విక్‌షిఫ్టర్‌ కూడా ఉన్నాయి. ట్రయంఫ్‌ పసుపు-నలుపు, నలుపు-తెలుపు రంగుల్లో ఒక్కోటి 500 చొప్పున తయారు చేయనుంది. ప్రతి బైక్‌పై ప్రత్యేక సీరియల్‌ నంబర్‌ ఉంటుంది.

ADVERTISEMENT

Details

ధర రూ.18.90 లక్షలు

ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 798 మోటో2 ఎడిషన్‌ ధర 15,525 పౌండ్లు (సుమారు రూ.18.90 లక్షలు). ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

2027 మే నుంచి డీలర్ల వద్ద డెలివరీలు ప్రారంభం కానున్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్న ఈ మోడల్‌ ప్రత్యేకత దాని ఇంజిన్‌ పవర్‌ మాత్రమే కాదు.. తక్కువ బరువు, రేసింగ్‌ స్థాయి హార్డ్‌వేర్‌, ఆధునిక టెక్నాలజీ కలయిక కూడా.

ADVERTISEMENT