Triumph Thruxton 400: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో ట్రయంఫ్ థ్రక్స్టన్ 400
ఈ వార్తాకథనం ఏంటి
బైక్ నడుపుతున్నప్పుడు స్పీడోమీటర్‌తో పాటు ఫోన్ నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? ట్రయంఫ్ థ్రక్స్టన్ 400లో అలాంటి మార్పులే రాబోతున్నట్లు తాజా స్పై షాట్స్ సూచిస్తున్నాయి. కొత్తగా టెస్టింగ్‌లో కనిపించిన ఈ బైక్‌కు 4 అంగుళాల రౌండ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే అమర్చారు. ఇది ఇటీవల విడుదలైన బొన్నెవిల్ T40 మోడల్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పోలిస్తే ఇది కీలకమైన అప్‌డేట్.
Details
ఫోన్ కనెక్టివిటీతో పాటు కొత్త స్విచ్‌లు
కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఫుల్ మ్యాప్ నావిగేషన్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, రూట్ ప్లానింగ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
రైడర్ తనకు అవసరమైన సమాచారాన్ని స్క్రీన్‌పై కనిపించేలా విడ్జెట్లను కూడా మార్చుకోవచ్చు. హ్యాండిల్‌పై ఉన్న స్విచ్‌లలోనూ మార్పులు చేశారు.
ఎడమవైపు నాలుగు దిశల్లో పనిచేసే కంట్రోల్ ప్యాడ్, క్రూయిజ్ కంట్రోల్ స్విచ్‌లు కనిపించాయి. కుడివైపు ఇంజిన్ కిల్ స్విచ్‌తో పాటు హజార్డ్ లైట్ బటన్‌ను కొత్త స్థానంలో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మోడ్ బటన్ కూడా ఉంది.
Details
రైడింగ్ భద్రతకు మరిన్ని ఫీచర్లు?
డిస్‌ప్లే మార్పుతోనే ఈ అప్‌డేట్ ఆగిపోకపోవచ్చు. బొన్నెవిల్ T40లో ఉన్న కొన్ని రైడర్ ఎయిడ్స్‌ను కూడా థ్రక్స్టన్ 400లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని స్పై షాట్స్ ఆధారంగా తెలుస్తోంది.
ఇందులో లీన్ సెన్సిటివ్ కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే హెచ్చరించే పానిక్ బ్రేక్ అలర్ట్, ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఇండికేటర్లు ఉండవచ్చని అంచనా.
ప్రస్తుతం ఈ బైక్‌లో స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే ఉన్నాయి.
Details
ఇంజిన్‌లో మార్పులు లేనట్టే!
మెకానికల్‌గా మాత్రం ప్రస్తుత ఇంజిన్‌నే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. 349 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 39.4 బీహెచ్‌పీ పవర్, 32 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. క్లిప్ ఆన్ హ్యాండిల్స్, బార్ ఎండ్ మిర్రర్స్, స్ప్లిట్ సీట్, యూఎస్‌డీ ఫోర్క్స్ వంటి కేఫ్ రేసర్ డిజైన్ ప్రత్యేకతలు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం థ్రక్స్టన్ 400 ఎక్స్‌షోరూమ్ ధర రూ.2,76,522. కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్, అదనపు ఎలక్ట్రానిక్ ఫీచర్లు వస్తే ధర రూ.3 లక్షలకు చేరవచ్చని అంచనా.
లేదంటే ట్రయంఫ్ ప్రత్యేక ప్రీమియం వేరియంట్‌ను తీసుకురావచ్చు. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా ధర, విడుదల తేదీని ప్రకటించలేదు.