Page Loader
అదిరే ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 వచ్చేసింది.. ధర ఎంతంటే?
అదిరే ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 వచ్చేసింది.. ధర ఎంతంటే?

అదిరే ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 వచ్చేసింది.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2023
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీఎస్ సంస్థ కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 310 బైకును లాంచ్ చేసింది. ఇండియాతో పాటు బ్యాంకాక్ మార్కెట్లోనూ ఈ బైక్ ను లాంచ్ చేశారు. భారత్ లో ఈ బైక్ షోరూం ధర రూ. 2.43 లక్షల నుంచి 2.64 లక్షల మధ్య ఉంటుంది. ఇక ఈ బైక్స్ సంబంధించి ఫ్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టీవీఎస్ డీలర్ షిప్స్ లో రూ. 3,100 చెల్లించి ఈ బైకును బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నుంచి డెలవరీలను ప్రారంభిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. వెడల్పైన హ్యాండిల్ బార్, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్, డైనమిక్ రియర్ ఎల్ఈడీ బ్రేక్ లైటింగ్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఈ బైక్ లో ఉండనున్నాయి.

Details

అపాచీ ఆర్‌టీఆర్‌ 310 బైక్ గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణించగలదు

కొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 310 బైక్ 35 బీహెచ్‌పీని 28 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 312 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్ట్‌ సింగిల్‌ సిలిండర్‌ 4 స్ట్రోక్‌ ఇంజిన్‌ అమర్చారు. ఈ బైక్‌ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 7.19 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో పాటు ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులు ఇచ్చారు. కస్టమర్లు తమకు నచ్చిన మార్పులతో ఈ బైకును కస్టమైజ్ చేసుకొనే అవకాశం ఉంది. ఇందుకు కస్టమర్లు అదనంగా చెల్లించాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్‌ 400, హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440, బజాజ్‌ డామినర్‌ బైకులకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.