Loading...
TVS Jupiter 1 Crore Production: టీవీఎస్‌ మరో సంచలనం... కోటి దాటిన జూపిటర్‌ ఉత్పత్తి
టీవీఎస్‌ మరో సంచలనం... కోటి దాటిన జూపిటర్‌ ఉత్పత్తి

TVS Jupiter 1 Crore Production: టీవీఎస్‌ మరో సంచలనం... కోటి దాటిన జూపిటర్‌ ఉత్పత్తి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 25, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ స్కూటర్‌ మార్కెట్లో టీవీఎస్‌ జూపిటర్‌ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మోడల్‌ మొత్తం ఉత్పత్తి కోటి యూనిట్లను దాటినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ప్రకటించింది. తమిళనాడులోని హోసూర్‌ తయారీ కేంద్రం నుంచి కోటో స్కూటర్‌ బయటకు వచ్చింది. 2013లో మార్కెట్లోకి వచ్చిన జూపిటర్‌ 110, 125 సీసీ మోడళ్లను కలిపి ఈ ఘనత సాధించింది. తొలి 50 లక్షల యూనిట్ల ఉత్పత్తికి తొమ్మిదేళ్లు పట్టగా, మరో 50 లక్షల యూనిట్లను కేవలం నాలుగేళ్లలోనే తయారు చేయడం ఈ స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోంది.

Details

110, 125 సీసీ మోడళ్లతో విస్తరించిన ప్రయాణం

2013లో కుటుంబ అవసరాలకు సరిపోయే స్కూటర్‌గా జూపిటర్‌ను టీవీఎస్‌ పరిచయం చేసింది.

తర్వాత 2021లో జూపిటర్‌ 125ను తీసుకొచ్చింది. 2024లో జూపిటర్‌ 110కు సమగ్ర మార్పులు చేసింది.

కొత్త ఛాసిస్‌, ముందు భాగంలోనే పెట్రోల్‌ నింపుకునే సదుపాయం, మెరుగైన డిజైన్‌ వంటి మార్పులు అందించింది.

రెండు మోడళ్లలోనూ సీవీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. జూపిటర్‌ 110లో 113.3 సీసీ ఇంజిన్‌, 125లో 124.8 సీసీ ఇంజిన్‌ లభిస్తుంది.

Details

ఫీచర్లు, మైలేజీ వినియోగదారులకు ఆకర్షణ

రెండు మోడళ్లలోనూ 5.1 లీటర్ల ఇంధన ట్యాంక్‌, 163 మిల్లీమీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉన్నాయి.

జూపిటర్‌ 125లో పొడవైన సీటు ప్రత్యేక ఆకర్షణ. మోడల్‌, వేరియంట్‌ను బట్టి రెండు హెల్మెట్లను ఉంచుకునే స్టోరేజ్‌, స్మార్ట్‌ఎక్స్‌ కనెక్ట్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కుటుంబ అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడమే ఈ స్కూటర్‌ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

ADVERTISEMENT

Details

హోండా యాక్టివాకు గట్టి పోటీ

ప్రస్తుతం జూపిటర్‌ 110 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.76,200 నుంచి రూ.92,225 వరకు ఉంది.

జూపిటర్‌ 125 ధర రూ.88,580 నుంచి రూ.96,765 వరకు కొనసాగుతోంది. టాప్‌ డ్యూయల్‌ టోన్‌ వేరియంట్‌ ధర రూ.90,525. ఈ స్కూటర్‌ హోండా యాక్టివా 6G, హీరో డెస్టినీ 110 మోడళ్లకు పోటీగా నిలుస్తోంది.

ప్పటికే ఐక్యూబ్‌, జూపిటర్‌ వంటి మోడళ్లతో దేశంలో రెండో అతిపెద్ద స్కూటర్‌ తయారీ సంస్థగా ఎదిగిన టీవీఎస్‌కు ఈ కోటి యూనిట్ల మైలురాయి మరింత బలాన్నిస్తోంది.

ADVERTISEMENT