TVS MOTOR కొత్త అపాచీ160 మార్కెట్లోకి ధర 1,09.990
TVS మోటార్ తన అపాచీ160ని ఆర్.టి.ఆర్ బైక్ లో బ్లాక్ డార్క్ ఎడిషన్(నలుపు రంగు)ను తీసుకు వచ్చింది. TVS అపాచీ160 కొత్త శ్రేణి మోటార్ సైకిళ్లు రూ.1,09.990.అపాచీ160 4 వాల్వ్ రూ.1,19,990(ఎక్స్ షోరూం చెన్నై)ధరల్లో దొరుకుతాయని కంపెనీ తెలిపింది. తాజాగా తీసుకు వచ్చిన బ్లాక్ డార్క్ ఎడిషన్,స్పోర్టియర్,బోల్డర్ రూపుతో వినియోగదారులను విపరీతంగా ఆకర్షించనుంది. యువత ఎక్కువగా అపాచీ బైక్ లను ఇష్టపడుతుంటారు.అత్యంత వేగమైన పికప్ తో పాటు సీటింగ్ స్టైలిష్డ్ గా ఉండటంతో అపాచీ బైక్ లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. పరిమిత గ్రాఫిక్స్ డిజైన్,ట్యాంకుపై భాగంలో నలుపు రంగు TVS లోగోనలుపు రంగు ఎగ్జాస్ట్ పైప్,నలుపు రంగు ఫినిషింగ్ తో ఇది లభ్యమవుతుందని కంపెనీ ప్రతినిధి విమల్ సంబ్లీ తెలిపారు.