Kia Seltos: కియా సెల్టోస్‌లో రెండు కొత్త వేరియంట్స్
ఆటో మొబైల్ దిగ్గజ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజా కియా సెల్టోస్ లో రెండు కొత్త వేరియంట్స్ ను ప్రవేశపెట్టింది. అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లెవల్-2 సాంకేతికతో వీటిని రూపొందించారు. జీటీఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్-(లైన్) వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్, డీజిల్ ఇంజన్‌తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో ఇవి తయారయ్యాయి. ఎక్స్ షోరూంలో వీటి ధర రూ.19.39 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇక కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15=16 వారాలు పట్టనుంది. మరోవైపు నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
రెండు నెలల్లోనే 50వేల యూనిట్ల బుకింగ్స్
కొత్త వేరియంట్‌లు 17 అటానమస్ ఫంక్షనాలిటీలను కలిగి ఉన్న లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ ఎయిడ్స్ సిస్టమ్‌తో వస్తాయి. వీటిలో ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంటుంది. కియా గ్లోసీ బ్లాక్ కలర్‌లో 18-అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉండనున్నాయి. వీటి కోసం అదనంగా రూ. 20,000 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రెండు నెలల్లోనే కొత్త సెల్టోస్ 50,000 యూనిట్ల బుకింగ్స్ మైలురాయిని అధిగమించిందని కియా ఇండియా ప్రకటించింది. కస్టమర్ల అభిరుచుకులకు అనుగణంగా, వారికి ఇష్టమైన కారును త్వరగా యాక్సెస్ చేయడం కంటే మెరుగైన మరొకటి లేదని పేర్కొంది.