LOADING...
Ultraviolette X 47 : బ్యాటరీ ధర వేరుగా… బైక్ ధర తక్కువగా..! అల్ట్రావయోలెట్ కొత్త ఆఫర్
బ్యాటరీ ధర వేరుగా… బైక్ ధర తక్కువగా..! అల్ట్రావయోలెట్ కొత్త ఆఫర్

Ultraviolette X 47 : బ్యాటరీ ధర వేరుగా… బైక్ ధర తక్కువగా..! అల్ట్రావయోలెట్ కొత్త ఆఫర్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఆల్ట్రావయోలెట్ సంస్థ తన ఎక్స్-47 మోడల్ కోసం ప్రత్యేకమైన పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (BAAS) పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ను 'బ్యాటరీ ఫ్లెక్స్'గా కంపెనీ పరిచయం చేసింది. ఈ విధానంలో బైక్ ధరను, బ్యాటరీ ధరను వేరు చేస్తూ కొనుగోలు ప్రక్రియను సులభం చేసింది. దీంతో ప్రీమియం కేటగిరీకి చెందిన ఈ బైక్‌ను కూడా ఎక్కువ మంది వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ BAAS విధానం ప్రధానంగా ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాల్లో మాత్రమే కనిపించేది. అయితే ఇప్పుడు మొదటిసారిగా రెండు చక్రాల ఎలక్ట్రిక్ వాహనానికి కూడా దీనిని అందుబాటులోకి తీసుకురావడం ప్రత్యేకతగా మారింది.

వివరాలు 

అల్ట్రావయోలెట్ ఎక్స్-47 - ధర, సబ్‌స్క్రిప్షన్ వివరాలు

అల్ట్రావయోలెట్ ఎక్స్-47 బైక్‌కు సంబంధించిన ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవచ్చు. అల్ట్రావయోలెట్ ఎక్స్-47 ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్‌షోరూం ధర సుమారు రూ.2.5లక్షల వరకు ఉంటుంది. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త చెల్లింపు విధానం ప్రకారం వినియోగదారులు ఈ బైక్‌ను కేవలం రూ.1,49,000 ప్రారంభ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ బ్యాటరీ కోసం నెలకు రూ.2,499 చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. ఈ ప్లాన్‌లో భాగంగా బ్యాటరీ ప్యాక్‌పై ఐదేళ్ల వారంటీ కూడా అందిస్తుంది. బైక్‌ను పూర్తిగా కొనుగోలు చేసినప్పటికీ బ్యాటరీని మాత్రం విడిగా ఫైనాన్స్ లేదా సబ్‌స్క్రిప్షన్ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల బైక్ కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది.

వివరాలు 

అల్ట్రావయోలెట్ ఎక్స్-47 - డిజైన్, బాడీ

ఈ వినూత్న ఆలోచనను అమలు చేయడానికి ఆల్ట్రావయోలెట్ సంస్థ 'ఎకోఫీ' అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. అల్ట్రావయోలెట్ X-47 పూర్తి స్థాయి అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందించబడింది. ఈ బైక్‌లోని ముఖ్య లక్షణాలు ఇవి. లుక్: కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చిన ఎఫ్77 మోడల్ నుంచి ప్రేరణ పొందిన హెడ్‌ల్యాంప్ డిజైన్, యాంగ్యులర్ బాడీ నిర్మాణం, అలాగే సౌకర్యవంతమైన సింగిల్-పీస్ సీటు ఇందులో ఉన్నాయి. బిల్డ్: ఈ బైక్‌లో క్యాస్ట్ అల్యూమినియం ఛాసిస్ ఉపయోగించారు. వేగంగా ప్రయాణించే సమయంలో గాలి ఒత్తిడిని తగ్గించి రైడర్‌కు రక్షణ కల్పించేందుకు ముందుభాగంలో విండ్‌స్క్రీన్ అమర్చారు.

Advertisement

వివరాలు 

అల్ట్రావయోలెట్ ఎక్స్-47 - సాంకేతికత, భద్రత

వేరియంట్: ఈ మోడల్ లైనప్‌లో భాగంగా కంపెనీ 'డెజర్ట్ వింగ్'అనే ప్రత్యేక ఎడిషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతిక పరంగా ఈ బైక్‌ను అత్యాధునికంగా రూపొందించారు. ఇందులోని అన్ని వేరియంట్లలో రాడార్ ఆధారిత సహాయక వ్యవస్థ 'యూవీ హైపర్ సెన్స్'అందుబాటులో ఉంది. కవరేజ్:ఈ వ్యవస్థ 150 డిగ్రీల ముందు వైపు వ్యూ, 68 డిగ్రీల వెనుక వైపు వర్టికల్ వ్యూతో పాటు సుమారు 200 మీటర్ల దూరం వరకు వాహనాలను గుర్తించి ట్రాక్ చేయగలదు. ఫీచర్లు: వెనుక నుంచి వస్తున్న వాహనాల గురించి ముందుగా తెలియజేసే రియర్ కొలిషన్ అలర్ట్, లేన్ మార్చేటప్పుడు సహాయపడే లేన్ చేంజ్ అసిస్టెన్స్,అలాగే ఓవర్‌టేక్ సమయంలో హెచ్చరికలు ఇచ్చే ఓవర్‌టేక్ వార్నింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

Advertisement

వివరాలు 

అల్ట్రావయోలెట్ ఎక్స్-47 - పనితీరు, బ్యాటరీ

కంట్రోల్: ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS,నాలుగు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్,తొమ్మిది స్థాయిల రీజెనరేటివ్ బ్రేకింగ్,డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్,టో అలర్ట్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎక్స్-47 మోడల్‌లో శక్తివంతమైన 10.7కిలోవాట్-ఆవర్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. మోటార్ సామర్థ్యం:ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 40హెచ్‌పీ పవర్,610 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పీడ్:ఈ బైక్ కేవలం 8.1సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.దీని గరిష్ట వేగం గంటకు 145కిలోమీటర్లు. రేంజ్: ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 323కిలోమీటర్లు (IDC రేంజ్)ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్: 1.6 కిలోవాట్ ఆన్‌బోర్డ్ ఎయిర్-కూల్డ్ యూనిట్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.ఇందులో సర్జ్ ప్రొటెక్షన్,ఎర్త్ లీకేజ్ ప్రొటెక్షన్ వంటి భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.

Advertisement