Volkswagen ID Every1: వోక్స్‌వ్యాగన్ ఐడి ఎవ్రీ1 ఆవిష్కరణ.. ఒక్క ఛార్జ్‌తో 250KM ప్రయాణం!
ఈ వార్తాకథనం ఏంటి
వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణలో కీలక ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా చౌకైన హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ Volkswagen ID Every1ను ఆవిష్కరించింది.
ఆకర్షణీయమైన డిజైన్, విభిన్నమైన ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది.
ఈ మోడల్‌ను వోక్స్‌వ్యాగన్ 2027లో తొలుత యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయనుందని,ఆ తర్వాత ఇతర మార్కెట్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Volkswagen ID Every1 ధర 20,000 యూరోలు(రూ. 18.95 లక్షలు)గా నిర్ణయించారు. ఇది ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు.
ముందు భాగంలో బ్లాక్-అవుట్ ఫాక్స్ గ్రిల్, పెద్దLEDహెడ్‌ల్యాంప్‌లు కలిగి ఉండటం దీనికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Details
గంటకు 135 కిలోమీటర్ల వేగం
అలాగే, బంపర్ రెండు వైపులా వర్టికల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉండడం దీన్ని మరింత స్టైలిష్‌గా మార్చింది.
ఈ కాన్సెప్ట్ మోడల్‌లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19-అంగుళాల వీల్స్ అందించారు.
క్యాబిన్‌లో నలుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునే విధంగా డిజైన్ చేశారు. 305 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉండటంతో ప్రయాణాలకు అనువుగా మారింది.
ఇందులోని 95 HP మోటార్ గరిష్టంగా గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఈ కారులో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఆధునిక సదుపాయాలు కలిపారు.