Loading...
Volkswagen Tiguan R-Line: వోక్స్‌వ్యాగన్ టైగన్ R-Lineకు గుడ్‌బై చెప్పిందా?
వోక్స్‌వ్యాగన్ టైగన్ R-Lineకు గుడ్‌బై చెప్పిందా?

Volkswagen Tiguan R-Line: వోక్స్‌వ్యాగన్ టైగన్ R-Lineకు గుడ్‌బై చెప్పిందా?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 07, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో ప్రీమియం SUVగా గుర్తింపు పొందిన వోక్స్‌వ్యాగన్ టైగన్ R-Line ఇప్పుడు కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. 2025 ఏప్రిల్‌లో విడుదలైన ఈ మోడల్‌ను తాజాగా వెబ్‌సైట్‌ నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. కంపెనీ మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ SUV అమ్మకాలను నిలిపివేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వెబ్‌సైట్‌ నుంచి తొలగించినంత మాత్రాన కారు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిందని నిర్ధారించలేం.

Details

రూ.47.11 లక్షల ధర.. శక్తివంతమైన ఇంజిన్

టైగన్ R-Lineను భారత్‌లో పూర్తిగా విదేశాల్లో తయారైన CBU మోడల్‌గా దిగుమతి చేసుకున్నారు.

విడుదల సమయంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUVగా నిలిచిన ఈ కారు చివరిగా రూ.47.11 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

ఇందులో 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉండేది. ఇది 201 bhp శక్తితో పాటు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేది.

7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌, 4MOTION ఆల్‌వీల్ డ్రైవ్ వ్యవస్థను స్టాండర్డ్‌గా అందించారు. ఐదుగురు ప్రయాణించేందుకు వీలున్న ఈ SUV ఒకే ఫుల్‌ లోడెడ్ వేరియంట్‌లో విక్రయించబడింది.

Details

టైగన్ స్థానంలో టైరాన్‌.. ధరల్లోనూ పోటీ

టైగన్ R-Lineతో పాటు వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-Lineను కూడా విక్రయిస్తోంది. మూడు వరుసల సీట్లతో వచ్చే ఈ SUV ధర రూ.47.74 లక్షలు.

టైగన్‌తో పోలిస్తే ఇది మరింత విశాలంగా ఉంటుంది. స్థానికంగా CKD విధానంలో అసెంబుల్ చేయడం వల్ల టైరాన్‌ను వివిధ వేరియంట్లలో అందిస్తున్నారు.

ఇందులో ఐదుగురు కూర్చునే టైరాన్ లైఫ్‌ మోడల్‌ ధర రూ.41.99 లక్షలు. రెండో వరుసలో ఎక్కువ స్థలం, పెద్ద బూట్‌ స్పేస్‌ దీని ప్రత్యేకతలు. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

ADVERTISEMENT

Details

భారత్‌లో ఇక రెండు SUVలే

టైగన్ R-Line వెబ్‌సైట్‌ నుంచి తొలగిపోవడంతో ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ఇండియా SUV విభాగంలో టేగూన్‌, టైరాన్‌ మాత్రమే కనిపిస్తున్నాయి.

టేగూన్‌ సాధారణ SUV కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోగా, టైరాన్‌ ప్రీమియం విభాగంపై దృష్టి పెట్టింది.

టైగన్ R-Line తిరిగి అందుబాటులోకి వస్తుందా, లేక పూర్తిగా నిలిపివేస్తారా అనే దానిపై కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ADVERTISEMENT