Loading...
Team India Bangladesh Tour: నాలుగేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే!
నాలుగేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే!

Team India Bangladesh Tour: నాలుగేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటనను కొత్త ఏడాదిలో, అంటే 2027 జనవరిలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆరు మ్యాచ్‌ల వైట్‌బాల్‌ సిరీస్‌ జరగనుంది. అయితే ఈ పర్యటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

వివరాలు

మూడు వన్డేలు, మూడు టీ20లు

ప్రతిపాదిత పర్యటనలో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌ను అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో సర్దుబాటు చేయడం ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.

ఎందుకంటే జనవరి 3 నుంచి 9 వరకు జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించనుంది.

ఆ తర్వాత జనవరి 21 నుంచే ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే బిజీగా ఉన్న ఈ షెడ్యూల్‌ మధ్య బంగ్లాదేశ్‌తో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ పర్యటనకు మార్గం సుగమం చేసేందుకు జింబాబ్వేతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ షెడ్యూల్‌ను మార్చే అవకాశాలున్నట్లు సమాచారం.

వివరాలు

ముస్తాఫిజుర్‌ వివాదంతో దెబ్బతిన్న క్రికెట్‌ సంబంధాలు

అయితే దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్‌కు సంబంధించిన ప్రాక్టీస్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. గతంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్‌ 2026 నుంచి తప్పించారు. ఈ పరిణామంతో భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య క్రికెట్‌ సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి.

ADVERTISEMENT

వివరాలు

క్రికెట్‌ సంబంధాలు తిరిగి పునరుద్ధరణ

ఈ వివాదం చివరకు భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌ బహిష్కరించే స్థాయికి చేరింది.

అయితే బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఆ తర్వాత బీసీబీ అధ్యక్షుడిగా అమీనుల్‌ ఇస్లాం స్థానంలో మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితులు మళ్లీ చక్కబడుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు తిరిగి పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

ప్రతిపాదిత బంగ్లాదేశ్‌ పర్యటనను ఖరారు చేయడానికి ముందు బీసీసీఐ భారత ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంది.

ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాతే ఈ పర్యటనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక భారత జట్టు చివరిసారిగా 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించింది.

ఆ సమయంలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.

ఒకవేళ 2027 జనవరిలో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తే.. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడినట్లవుతుంది.

ADVERTISEMENT