Loading...
Kaka: చిరంజీవి 'కాకా' విడుదలపై క్లారిటీ.. జనవరి 13న థియేటర్లలోకి!
చిరంజీవి 'కాకా' విడుదలపై క్లారిటీ.. జనవరి 13న థియేటర్లలోకి!

Kaka: చిరంజీవి 'కాకా' విడుదలపై క్లారిటీ.. జనవరి 13న థియేటర్లలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కాకా' విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ప్రముఖ రచయిత కోన వెంకట్ తెరదించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదంటూ వస్తున్న వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఘాటైన పోస్టు పెట్టారు. 'కాకా' సినిమాపై వస్తున్న పుకార్లకు, నిరాధార కథనాలకు ఇక ముగింపు పలుకుతున్నామని కోన వెంకట్ పేర్కొన్నారు. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. కానీ మేము జనవరి 13న వస్తున్నాం. సంక్రాంతికి 'కాకా' వస్తున్నాడు. అసలైన పండగను తీసుకొస్తున్నాడని తన పోస్టులో స్పష్టం చేశారు. దీంతో సినిమా విడుదల తేదీపై కొనసాగుతున్న అనుమానాలకు ఆయన తెరదించారు.

వివరాలు

వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం

చిరంజీవి కథానాయకుడిగా, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనశ్వర రాజన్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా చిత్రీకరణతో పాటు డబ్బింగ్‌ పనులను కూడా చిత్రబృందం సమాంతరంగా కొనసాగిస్తోంది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ వీడియోను కూడా పంచుకుంది.

వివరాలు

సంక్రాంతి బరిలో హోరాహోరీ పోటీ

వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా పోటీ ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న చిత్రాన్ని అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న 'ధర్మన్‌'తో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో చిరంజీవి 'కాకా' జనవరి 13న విడుదల కానున్నట్లు చిత్రబృందం ధృవీకరించడం సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద సినిమాల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

ADVERTISEMENT