Page Loader
టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena
బ్లేడ్ బ్యాటరీతో 500km కంటే ఎక్కువ నడిచే అవకాశం ఉంది

టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 21, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

Xiaomi మంగోలియాలో తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు Modenaను టెస్టింగ్ దశకు తీసుకువచ్చింది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ వాహనంలో ఆటోనోమస్ డ్రైవింగ్ సామర్థ్యం ఉంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన Xiaomi, కార్లను రూపొందించే టెక్ కంపెనీలలో ఒకటి. సోనీ ఇప్పటికే కొన్ని ప్రోటోటైప్‌లను ప్రదర్శించగా, ఆపిల్ రహస్యంగా ఇటువంటి వాటిపై పనిచేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Xiaomi నుండి రాబోయే ఈ ఎలక్ట్రిక్ వాహనం తాజా చిత్రాలు, ఇది లాంచ్‌కు చేరువలో ఉందని తెలియజేస్తున్నాయి. రాబోయే Xiaomi Modenaను రహస్యంగా టెస్టింగ్ కు తరలించడం వలన బయటి డిజైన్ చాలా తక్కువగా కనిపిస్తుంది.

కార్

ఇంకా ప్రారంభ ప్రోటోటైప్ దశలోనే ఉన్న Xiaomi Modena

Xiaomi Modena సాంకేతిక వివరాలను టెక్ దిగ్గజం ఇంకా వెల్లడించలేదు. ఇది LFP సాంకేతికతతో BYD-మూలం "బ్లేడ్" బ్యాటరీ ప్యాక్ లేదా త్వరగా ఛార్జింగ్ అయ్యే CATL 800V క్విలిన్ బ్యాటరీ ప్యాక్‌ ఉండచ్చని భావిస్తున్నారు. ఇందులో ప్రయాణికుల భద్రతా కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు లెవెల్-3 ADAS ఫంక్షన్ కూడా ఉంది. Xiaomi Modena ఇంకా ప్రారంభ ప్రోటోటైప్ దశలోనే ఉంది. లాంచ్ అయినప్పుడు, చైనాలో ఎలక్ట్రిక్ సెడాన్ ధర CNY 260,000 (సుమారు రూ. 31.13 లక్షలు) నుండి CNY 350,000 (దాదాపు రూ. 41.9 లక్షలు) మధ్య ఉండే అవకాశముంది. ఇది 2024లో విడుదల అవుతందని విశ్లేషకులు భావిస్తున్నారు.