Xiaomi Sky Nomad N70,N90: ఒక్కసారి ఛార్జింగ్‌తో 1,705 కి.మీ.. Xiaomi కొత్త SkyNomad ఎస్‌యూవీలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ సంస్థ Xiaomi ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన SkyNomad సిరీస్‌లో N70, N90 మోడళ్లను విడుదల చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఐదు సీట్ల N70 Pro,N70 Maxతో పాటు ఏడు సీట్ల N90 Max, N90 Max Studio వేరియంట్లు ఉన్నాయి. ధరలు RMB 2,09,900 (సుమారు రూ.30లక్షలు) నుంచి ప్రారంభమై, N90 Max Studioకు RMB 2,99,900 (సుమారు రూ.42 లక్షలు) వరకు ఉన్నాయి. N90 Max Studioలో ప్రత్యేకంగా పైకి తెరుచుకునే క్యాంపింగ్ రూఫ్‌ను కూడా అందించారు. SkyNomad సాధారణ ఎలక్ట్రిక్ కారు కాదు. ఇది Extended Range Electric Vehicle (EREV) టెక్నాలజీతో పనిచేస్తుంది.
వివరాలు
అన్ని వేరియంట్లలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్
అన్ని వేరియంట్లలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ నేరుగా చక్రాలకు శక్తిని అందించదు.
బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్లకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జనరేటర్‌గా పనిచేస్తుంది. వాహనాన్ని ముందుకు నడిపించే బాధ్యత పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్లదే.
డిజైన్ విషయానికి వస్తే.. లోపల ఎక్కువ స్థలం ఉండేలా SkyNomadను రూపొందించారు.
నిటారుగా ఉండే బాడీ, పొడవైన వీల్‌బేస్ ఈ ఎస్‌యూవీల ప్రత్యేకత. పెద్దదైన N90 Max పొడవు 5,285 మి.మీ.,వెడల్పు 1,998 మి.మీ.,ఎత్తు 1,825 మి.మీ.
కాగా.. వీల్‌బేస్ 3,080 మి.మీ.గా ఉంది. N70 Max పొడవు 4,960 మి.మీ., వెడల్పు 1,998 మి.మీ., ఎత్తు 1,765 మి.మీ.గా ఉండగా.. వీల్‌బేస్ 2,950 మి.మీ.గా ఉంది.
వివరాలు
140కి పైగా ఏరోడైనమిక్ మార్పులు
SUV ఆకృతితో పాటు MPV తరహాలో విశాలమైన ఇంటీరియర్‌ను అందించామని Xiaomi చెబుతోంది.
ముందు, వెనుక లైట్లను దాదాపు ఒకే ఎత్తులో ఏర్పాటు చేసి సమతుల్యమైన డిజైన్‌ను ఇచ్చారు.
హెడ్‌లైట్లు,టెయిల్‌లైట్లు, డోర్ హ్యాండిల్స్, సైడ్ కెమెరాల్లో రౌండెడ్-రెక్టాంగిల్ డిజైన్ కనిపిస్తుంది.
గాలి నిరోధకతను తగ్గించేందుకు 140కి పైగా ఏరోడైనమిక్ మార్పులు చేశారు. ఇందులో యాక్టివ్ గ్రిల్ కూడా ఉంది.
దీంతో డ్రాగ్ కోఎఫిషియెంట్ 0.255గా నమోదైంది. డోర్ల విషయంలోనూ ఆధునిక ఫీచర్లను అందించారు.
టచ్,వాయిస్ కమాండ్లతో ఎలక్ట్రిక్ డోర్లను తెరవొచ్చు. వెనుక డోర్లు దాదాపు 90 డిగ్రీల వరకు తెరుచుకుంటాయి.
AI ఆధారిత యాంటీ-కొలిజన్ డోర్ సిస్టమ్ కూడా ఉంది. రెండో, మూడో వరుస సీట్లకు ప్రైవసీ కర్టెన్లు ఇచ్చారు.
వివరాలు
ఇంటీరియర్‌లోనూ స్థలానికి, సౌకర్యానికి ప్రాధాన్యం
వాహనంలోకి సులభంగా ఎక్కేందుకు, దిగేందుకు ఆప్షనల్ ఎలక్ట్రిక్ సైడ్ స్టెప్‌ను కూడా ఎంచుకోవచ్చు.
ఇంటీరియర్‌లోనూ స్థలానికి, సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చారు.
N70 Maxలో 1,530 మి.మీ. వెడల్పైన సెంటర్ కన్సోల్, రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్, దాచిన ఎయిర్ వెంట్స్, 27W యాక్సెసరీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
ఎక్కువగా చేతితో తాకే ప్రాంతాల్లో సాఫ్ట్ మెటీరియల్‌ను ఉపయోగించారు.
క్యాబిన్‌లో ఉపయోగించిన మెటీరియల్స్ భద్రత కోసం OEKO-TEX సర్టిఫికేషన్ కూడా ఉంది.
సీట్లను 12 లేయర్ల నిర్మాణంతో రూపొందించారు. ముందు సీట్లలో మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ సదుపాయాలు ఉన్నాయి.
వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా నాలుగు జీరో-గ్రావిటీ సీట్లను పొందవచ్చు. ప్రయాణికులకు 2,760 మి.మీ. వరకు స్థలాన్ని అందించారు.
వివరాలు
రెండో వరుసలో 1.55 మీటర్ల వరకు లెగ్‌రూమ్
రెండో వరుసలో 1.55 మీటర్ల వరకు లెగ్‌రూమ్ ఉంటుంది. సీట్లను ఉపయోగిస్తున్నప్పటికీ బూట్ స్పేస్‌ను 1,831 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.
ఇందులో ఏడు 20 అంగుళాల సూట్‌కేసులను కూడా పెట్టుకునే అవకాశం ఉంది.
బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే.. అన్ని SkyNomad వేరియంట్లలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రేంజ్ ఎక్స్‌టెండర్‌గా పనిచేస్తుంది.
N70 Proలో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్ ఉంది. ఇది 210 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
52 kWh LFP బ్యాటరీతో 351 కి.మీ. వరకు ఎలక్ట్రిక్ రేంజ్, మొత్తం 1,351 కి.మీ. కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది.
0 నుంచి 100 కి.మీ. వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది.
వివరాలు
కేవలం 5.5 సెకన్లలో 0-100 కి.మీ వేగం
N70 Maxలో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 76 kWh బ్యాటరీ ఉంటుంది.
ఇది 505 కి.మీ.వరకు ఎలక్ట్రిక్ రేంజ్,మొత్తం 1,461కి.మీ. కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది. 0-100 కి.మీ. వేగాన్ని కేవలం 5.5 సెకన్లలో చేరుకుంటుంది.
N90 Max, N90 Max Studioలో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉంది. ఈ సెటప్ గరిష్ఠంగా 310 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
79 kWh బ్యాటరీతో 464కి.మీ. వరకు ఎలక్ట్రిక్ రేంజ్ లభిస్తుంది.
వివరాలు
డ్యాష్‌బోర్డ్‌లో 16.1అంగుళాల 3K టచ్‌స్క్రీన్
కంబైన్డ్ రేంజ్ మాత్రం గరిష్ఠంగా 1,705 కి.మీ. వరకు ఉంటుంది. అన్ని SkyNomad వేరియంట్లలో NVIDIA Thor ఆధారిత డ్రైవర్ అసిస్టెన్స్ చిప్,LiDAR,రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి.
డ్యాష్‌బోర్డ్‌లో 16.1అంగుళాల 3K టచ్‌స్క్రీన్, 8.8అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు.
ADAS వ్యవస్థలో వాయిస్ కమాండ్‌తో డ్రైవింగ్ అసిస్టెన్స్, ఆటోమేటిక్ లేన్ చేంజ్, పార్కింగ్ స్థలాన్ని గుర్తించి అక్కడి వరకు మార్గనిర్దేశం చేసే నావిగేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.