LOADING...
Yamaha EC-06 : యమహా EC-06 రివ్యూ: డిజైన్, రేంజ్, పనితీరు ఎలా ఉన్నాయి?
యమహా EC-06 రివ్యూ: డిజైన్, రేంజ్, పనితీరు ఎలా ఉన్నాయి?

Yamaha EC-06 : యమహా EC-06 రివ్యూ: డిజైన్, రేంజ్, పనితీరు ఎలా ఉన్నాయి?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్‌లా అనిపిస్తున్నప్పటికీ, Yamaha వంటి సంస్థలు చాలా సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి యమహా ఒంటరిగా కాకుండా, బెంగళూరుకు చెందిన River అనే స్టార్టప్‌తో కలిసి పనిచేసింది. ఈ సంస్థలో యమహా పెట్టుబడి పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధికి సహకరించింది. ఈ భాగస్వామ్య ఫలితమే యమహా EC-06. సుమారు 40 మిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందించింది.

వివరాలు 

డిజైన్: క్లీన్, సింపుల్, స్టైలిష్ లుక్

యమహా EC-06 డిజైన్ విషయానికి వస్తే, ఇది మొదటి చూపులోనే ప్రత్యేకంగా కనిపిస్తుంది. River Indieతో పోలిస్తే, ఇది మరింత సింపుల్,క్లీన్ డిజైన్‌ను కలిగి ఉంది. స్లీక్ సిల్హౌట్‌తో రూపొందించిన ఈ స్కూటర్‌లో రగ్గడ్ లుక్ కంటే మినిమలిజానికి ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని చోట్ల River లోగో కనిపించడం ద్వారా దీని మూలాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ డిజైన్‌కు కొంత నష్టం కూడా ఉంది. మెటల్ గార్డ్స్, ఫ్రంట్ ఫుట్ పెగ్స్, గ్లోవ్‌బాక్స్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు ఇందులో లేవు. ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ, రోజువారీ వినియోగంలో ఉపయోగపడే అంశాలు.

వివరాలు 

పనితీరు & రేంజ్: నగర ప్రయాణాలకు సరిపోయేలా

యమహా EC-06లో 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, IPMSM మోటార్ అమర్చారు. ఇది 6.7 kW పవర్, 26 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంఖ్యలు పెద్దగా ఆకట్టుకునేలా కనిపించకపోయినా,నగర ప్రయాణాల కోసం సరిపడేలా ట్యూన్ చేశారు. స్మూత్ రైడింగ్ అనుభవం ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం.స్కూటర్ గరిష్ట వేగం సుమారు 79 kmph. ఇందులో Eco,Standard,Power అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రేంజ్ విషయానికి వస్తే: Eco మోడ్‌లో 100-110 కి.మీ Standard‌లో సుమారు 80 కి.మీ Power మోడ్‌లో 60కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు ఫుల్ ఛార్జ్‌కు సుమారు 10గంటలు పడుతుంది. 80%ఛార్జ్‌కు 8గంటలు పడుతుంది.అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కంటే రాత్రిపూట ఛార్జింగ్‌కు అనుకూలంగా రూపొందించారు.

Advertisement

వివరాలు 

రైడ్ క్వాలిటీ: స్థిరంగా ఉన్నా చిన్న లోపం

యమహా EC-06లో ముందు, వెనుక రెండింటికీ డిస్క్ బ్రేక్స్ (200 mm) ఉన్నాయి. అలాగే Combined Braking System (CBS) కూడా ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక కాయిల్ స్ప్రింగ్స్ ఇచ్చారు. ఇది నగర రోడ్లకు సరిపోయే సెటప్. స్కూటర్ స్టేబుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. కానీ ముందు సస్పెన్షన్ కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తుంది. బంప్స్, గుంతల మీద కొద్దిగా గట్టిగా ఫీల్ అవుతుంది. 1354 mm వీల్‌బేస్, 132 కిలోల బరువు వల్ల మంచి బ్యాలెన్స్ ఉంటుంది. 145 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో నగర రోడ్లకు సరిపోతుంది.

Advertisement

వివరాలు 

ప్రాక్టికాలిటీ: మిశ్రమ అనుభవం

ఈ స్కూటర్‌లో 24.5 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంది. LED లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ (Y-Connect) వంటి ఫీచర్లు ఉన్నాయి. మోటార్, బ్యాటరీకి IP67 రక్షణ ఉండటం వల్ల వర్షం వంటి పరిస్థితుల్లో కూడా సేఫ్‌గా ఉంటుంది. అయితే గ్లోవ్‌బాక్స్, అదనపు ఫుట్ సపోర్ట్ లాంటివి లేకపోవడం కొంతమందికి అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది డిజైన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది.

వివరాలు 

సింపుల్ కానీ అర్థవంతమైన మార్పు

యమహా EC-06 కొత్త రికార్డులు సృష్టించడానికి కాదు, ఇప్పటికే ఉన్న ఫీచర్లను మెరుగుపరచడానికి రూపొందించారు. ఇది క్లీన్ డిజైన్, మంచి రైడింగ్ అనుభవం ఇస్తుంది. అయితే కొన్ని ప్రాక్టికల్ ఫీచర్లు లేకపోవడం, ముందు సస్పెన్షన్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మొత్తానికి, ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీని సింపుల్‌గా, అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో ఒక మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు.

Advertisement