Loading...
Yamaha Tenere 4: అడ్వెంచర్ బైక్ ప్రియులకు యమహా గుడ్ న్యూస్.. Tenere 4 ఆవిష్కరణ
అడ్వెంచర్ బైక్ ప్రియులకు యమహా గుడ్ న్యూస్.. Tenere 4 ఆవిష్కరణ

Yamaha Tenere 4: అడ్వెంచర్ బైక్ ప్రియులకు యమహా గుడ్ న్యూస్.. Tenere 4 ఆవిష్కరణ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 10, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

యమహా Tenere 4 కాన్సెప్ట్‌ను తొలిసారిగా నవంబర్ 2న నిర్వహించిన 'Redefine the Standard' కార్యక్రమంలో పరిచయం చేసింది. తాజాగా EICMA 2026లోనూ ప్రదర్శించింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్ట్ మాత్రమే. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే, Tenere 700 కంటే చిన్నదిగా ఉండే ఈ బైక్ అడ్వెంచర్ రైడింగ్‌ను మరింత మందికి చేరువ చేసే అవకాశం ఉంది.

Details

కొత్త సింగిల్ సిలిండర్ ఇంజిన్

Tenere 4లో పూర్తిగా కొత్త సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. దీని సీసీ సామర్థ్యం, పవర్‌, టార్క్‌ వివరాలను యమహా ఇంకా ప్రకటించలేదు.

తక్కువ, మధ్యస్థ వేగాల్లో మంచి టార్క్‌ ఇవ్వడంతో పాటు అధిక వేగాల్లోనూ పనితీరు కొనసాగించేలా ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.

ఆఫ్‌రోడ్ ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కూ ఇది అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Details

ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు ప్రత్యేక హార్డ్‌వేర్

కొత్త ఛాసిస్‌తో రూపొందిన ఈ బైక్‌లో ముందు, వెనుక KYB సస్పెన్షన్‌ ఉన్నాయి. ముందు 21 అంగుళాలు, వెనుక 18 అంగుళాల స్పోక్ వీల్స్‌ ఇచ్చారు.

వీటికి Michelin Anakee Wild టైర్లు అమర్చారు. Akrapovic టైటానియం ఎగ్జాస్ట్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

రాలీ బైక్‌ల తరహాలో సన్నని డిజైన్‌, పొడవైన సీటు, నిటారుగా కూర్చునే రైడింగ్ పొజిషన్‌తో Tenere 4ను రూపొందించారు.

ఉత్పత్తి దశకు చేరితే KTM 390 Adventure R వంటి బైక్‌లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

అయితే ఇంజిన్ సామర్థ్యం, ధర, లాంచ్ తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది యమహా భవిష్యత్ అడ్వెంచర్ బైక్‌లపై ఆసక్తిని పెంచుతున్న కాన్సెప్ట్‌ మాత్రమే.

ADVERTISEMENT