PM Modi: జెలెన్‌స్కీకి మోదీ ఫోన్ కాల్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనాలని భారత్ కోరుకుంటోందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం లభించేలా జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ సహకరించేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాలపైనా ఇద్దరువివరాలు నేతలు చర్చించారు.
వివరాలు
అబుదాబిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ త్రైపాక్షిక చర్చలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా కీలక ప్రయత్నం చేస్తోంది.
నవంబర్ 10, 11 తేదీల్లో అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలతో సమావేశం నిర్వహించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
యుద్ధాన్ని ముగించడం, యుద్ధానంతరం భద్రతకు సంబంధించిన ఒప్పందాలు, ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు.
వివరాలు
ఈయూతో సమన్వయంపై జెలెన్‌స్కీ ప్రకటన
అమెరికా మధ్యవర్తిత్వంతో జరగనున్న చర్చలకు ముందు ఐరోపా సమాఖ్యతో తమ వైఖరిని సమన్వయం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనే విషయంలో ఉక్రెయిన్‌కు న్యాయం జరిగేలా చూడాలని ఐరోపా దేశాలు దౌత్యపరంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అబుదాబిలో జరగనున్న సమావేశానికి సంబంధించి ఇరుపక్షాలు తమ వైఖరులను సమన్వయం చేసుకున్నాయని జెలెన్‌స్కీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
త్రైపాక్షిక చర్చల ద్వారా ఫలితాలు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
వివరాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు: ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు శాంతి ప్రయత్నాలకు ప్రధాన అడ్డంకిగా మారాయని అభిప్రాయపడ్డారు.
సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధంముగియడానికి ఎదురవుతున్న ప్రధాన సమస్యలపై ట్రంప్‌ను ప్రశ్నించారు.
దీనికి ఆయన స్పందిస్తూ..జెలెన్‌స్కీ,పుతిన్ మధ్య ఉన్న ద్వేషమే ప్రధానసమస్య అని అన్నారు.
తాను అమెరికాఅధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధం ఎప్పుడూ ప్రారంభమయ్యేది కాదని వ్యాఖ్యానించారు.
అయితే యుద్ధం మొదలైన తర్వాత దాన్ని తాను వారసత్వంగా స్వీకరించాల్సి వచ్చిందన్నారు.
అయినప్పటికీ ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరేందుకు పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Glad to have had a productive telephone conversation with President Zelenskyy. We reviewed our wide-ranging bilateral cooperation and agreed to further strengthen India-Ukraine ties.
— Narendra Modi (@narendramodi) November 9, 2026
I thanked President Zelenskyy for sharing his perspectives on the ongoing conflict, its…