NTR Dragon Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' క్లైమాక్స్‌లో విధ్వంసమే.. గూస్‌బంప్స్ తెప్పించేలా భారీ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా 'డ్రాగన్' సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కథకు కీలకమైన ఈ చివరి ఫైట్‌ను సాధారణ స్థాయిలో కాకుండా ఓ విజువల్ వండర్‌లా తెరపైకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఇందుకోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కళ్లు చెదిరేలా ఓ భారీ ప్రత్యేక సెట్‌ను రూపొందిస్తోందని ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క ఫైట్ కోసమే చిత్ర బృందం బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
డిసెంబర్ మొదటి వారం నుంచే క్లైమాక్స్ ఫైట్
డిసెంబర్ మొదటి వారం నుంచే ఈ హై-వోల్టేజ్ క్లైమాక్స్ పోరాట సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించేందుకు మేకర్స్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
హీరో, విలన్ల మధ్య సాగే ఈ పోరు థియేటర్లలో ప్రేక్షకులకు ప్యూర్ మాస్ ఎనర్జీతో పాటు గూస్‌బంప్స్ అనుభూతిని అందించేలా ఉండబోతోందని టాక్.
వివరాలు
ఫైట్ తర్వాత భారీ పాట
క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచే భారీ పాటను కూడా చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ పాట చిత్రీకరణతో సినిమా మేజర్ షూటింగ్ దాదాపుగా పూర్తికానుంది. ఒకవైపు అదిరిపోయే క్లైమాక్స్ ఫైట్, మరోవైపు గ్రాండ్ సాంగ్‌తో 'డ్రాగన్' టీమ్ డిసెంబర్‌ను పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్‌గా మార్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
వెండితెరపై ఈ యాక్షన్ ట్రీట్‌ను చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.