Yezdi Roadster Red Wolf Edition: యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వుల్ఫ్ ఎడిషన్ విడుదల.. ధర రూ.2.10 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఉండే యెజ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వుల్ఫ్ ఎడిషన్ ను క్లాసిక్ లెజెండ్స్ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ధర రూ.2.10 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. సాధారణ రోడ్‌స్టర్ మోడల్‌తో పోలిస్తే ఈ బైక్‌లో ప్రధానంగా లుక్, డిజైన్ పరంగా మార్పులు చేశారు. 1970ల నాటి యెజ్డీ బైక్‌ల రంగుల నుంచి ప్రేరణ తీసుకుని ఈ రెడ్ వుల్ఫ్ ఎడిషన్‌ను రూపొందించారు. అయితే ఇంజిన్, మెకానికల్ అంశాలు మాత్రం స్టాండర్డ్ మోడల్‌లాగే ఉంటాయి.
రెడ్ వుల్ఫ్ ఎడిషన్
సోలో సీట్ లేదా పిలియన్ సీట్ ఎంపికకు అవకాశం
రెడ్ వుల్ఫ్ ఎడిషన్‌లో డీప్ గ్లోస్ రెడ్ కలర్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఎగ్జాస్ట్, ఇంజిన్, హ్యాండిల్‌బార్‌లపై క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. రోడ్‌స్టర్ స్టైలింగ్‌తో స్కల్ప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్, బాబర్ స్టైల్ టెయిల్ సెక్షన్, వెడల్పైన రియర్ టైర్ హగ్గర్ అందించారు. దీనికి సరిపోయేలా బ్రౌన్ కలర్ సీట్ ఇచ్చారు. సోలో సీట్ లేదా పిలియన్ సీట్ ఎంపిక చేసుకునే విధంగా మాడ్యులర్ సెటప్ కూడా ఉంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న బైక్‌లలో అత్యంత వెడల్పైన రియర్ టైర్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
క్లచ్
రైడింగ్ సౌలభ్యం కోసం అసిస్ట్,స్లిప్పర్ క్లచ్
ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో అదే 334 సీసీ ఆల్ఫా2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. గరిష్టంగా 29 హెచ్‌పీ పవర్, 29.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్ సౌలభ్యం కోసం అసిస్ట్,స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. బ్రేకింగ్ కోసం ముందుభాగంలో 320 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్‌తో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందించారు.
ఫుల్ ట్యాంక్
ఫుల్ ట్యాంక్‌తో 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణం
ఇంకా 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ట్యాంక్‌తో 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లు టూరింగ్‌కు అనుకూలంగా రూపొందించారు. సీట్ ఎత్తు 795 మిల్లీమీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 171 మిల్లీమీటర్లు. సెంటర్ ఫార్వర్డ్ ఫుట్‌పెగ్స్ కారణంగా రైడింగ్ పొజిషన్ మరింత రిలాక్స్‌గా ఉంటుంది.