యజ్డీ రోడ్‌స్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్
భారత ఆటో మార్కెట్లో Yezdi MY-2023, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ గట్టిగా పోటీపడుతున్నాయి. రోడ్‌స్టర్ మోడల్‌లో కొత్తగా క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. రాయల్ 350కి, యెజ్డీ పోటీగా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రాయల్ 350 మీటియోర్ వాహనానికి మూడేళ్ల వారంటీ ప్రకటించింది. 400cc క్రూయిజర్ విభాగంలో రైడర్ భద్రతకు ఎన్‌ఫీల్డ్ మాదిరిగానే, యజ్డీ డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ కలిగి ఉంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కంపెనీ అందిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 చూసేందుకు స్టైలీష్ లుక్కిస్తోంది. రాయల్ 350లో 15 లీటర్ టియర్ డ్రాప్ ఆకారపు ఫ్యూల్ ట్యాంక్, బ్యాక్‌రెస్ట్‌తో కూడిన స్ప్లిట్-టైప్ సీట్లు, పెద్ద విండ్‌స్క్రీన్, వృత్తాకార హెడ్‌లైట్‌ను కలిగి ఉంది.
మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడవడం ప్రత్యేకత
Yezdi రోడ్‌స్టర్‌లో వాలుగా ఉండే ఫ్యూల్ ట్యాంక్, బ్లాక్-అవుట్ ప్రొటెక్టర్‌తో రౌండ్ హెడ్‌లైట్ యూనిట్, వెడల్పాటి హ్యాండిల్ బార్, గుండ్రని అద్దాలు, ప్యాడెడ్ పిలియన్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన స్టెప్-అప్ సీట్, రౌండ్ LED టైల్యాంప్, డ్యూయల్ పీషూటర్ ఎగ్జాస్ట్‌లు ఉన్నాయి. రెండు మోటార్ సైకిళ్లు మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడవడం ప్రత్యేకత. Yezdi రోడ్‌స్టర్ 334cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఆధారంగా నడుస్తోంది. రాయల్ 350, 349ccతో ఎయిర్ కూల్డ్, J-సిరీస్, సింగిల్-సిలిండర్ పై నడుస్తోంది. రోడ్‌స్టర్ ఎక్స్-షోరూమ్ ధరల్లో రూ. 2.01 నుంచి రూ. 2.09 లక్షలు ఉండగా, రాయల్ రూ. 2.01 నుంచి రూ. 2.19 లక్షలుగా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.