LOADING...
Zelo Electric: రూ. 60 వేలలోపే 100 కి.మీ రేంజ్‌ కలిగిన హై-స్పీడ్ స్కూటర్.. మార్కెట్‌లో సంచలనం
రూ. 60 వేలలోపే 100 కి.మీ రేంజ్‌ కలిగిన హై-స్పీడ్ స్కూటర్.. మార్కెట్‌లో సంచలనం

Zelo Electric: రూ. 60 వేలలోపే 100 కి.మీ రేంజ్‌ కలిగిన హై-స్పీడ్ స్కూటర్.. మార్కెట్‌లో సంచలనం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్ దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ జెలో నైట్+ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 59,990 మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత తక్కువ ధరలోనూ కంపెనీ అన్ని ప్రధాన ఫీచర్లతో ఈ స్కూటర్‌ను అందిస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యం, క్రూయిజ్ కంట్రోల్‌ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

వివరాలు 

అధునాతన ఫీచర్ల జాబితా 

జెలో నైట్+ లో ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్, USB ఛార్జింగ్ పోర్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీంట్లోని పోర్టబుల్ బ్యాటరీ వల్ల అవసరమైతే సులభంగా తొలగించి ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు. భద్రత దృష్ట్యా ముందు, వెనుక రెండింటికీ డ్రమ్ బ్రేకులు, అలాగే హిల్ హోల్డ్ కంట్రోల్ ఫీచర్ అందించారు. ఈ స్కూటర్‌లో 1.8 kWh పోర్టబుల్ LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీ ఉంది. ఇది కేవలం ఎక్కువ రేంజ్ మాత్రమే కాకుండా, థర్మల్ ప్రొటెక్షన్, సులభమైన హోమ్ ఛార్జింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

వివరాలు 

55 కి.మీ/గంట గరిష్ట వేగం 

జెలో నైట్+ లో 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. దీని వలన గరిష్టంగా గంటకు 55 కి.మీ వేగాన్ని అందుకోవచ్చు. ఈ మోడల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జెలో డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2025 ఆగస్టు 20 నుండి మొదలవుతాయి. ప్రస్తుతం జెలో ఎలక్ట్రిక్ నాలుగు మోడళ్లను మార్కెట్లో అందిస్తోంది. వీటిలో మూడు లో-స్పీడ్ స్కూటర్లు - Zoop, Knight, Zaeden, మరియు ఒక హై-స్పీడ్ RTO సర్టిఫైడ్ మోడల్ - Zaeden+.

వివరాలు 

సింపుల్ కానీ స్టైలిష్ డిజైన్ 

జెలో నైట్+ డిజైన్ సింపుల్‌గా, కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ముందుభాగంలో వంగిన ఆకారంలో ఆప్రాన్ డిజైన్ ఉండగా, మధ్యలో పెద్ద హెడ్‌ల్యాంప్,ఇరువైపులా LED టర్న్ ఇండికేటర్లు అమర్చారు. సింగిల్-పీస్ సీటు, వెనుక భాగంలో టేపరింగ్ డిజైన్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. ఈ స్కూటర్ రెండు సింగిల్-టోన్ కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. నలుపు, తెలుపు, గ్రే, పసుపు రంగుల ఎంపికలో వినియోగదారులు తీసుకోవచ్చు.

వివరాలు 

ప్రతిరోజు వాడకానికి సరైన ఎంపిక 

ప్రారంభోత్సవ సందర్భంగా జెలో ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య బహేటి మాట్లాడుతూ.. "ఈ స్కూటర్ ప్రతిరోజూ ఉపయోగించే వారికి ఉత్తమమైన ఎంపిక అవుతుంది. భద్రతా ఫీచర్లు అద్భుతంగా ఉండేలా మేము దీన్ని రూపొందించాము. డైలీ యూజ్ కోసం అనువుగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాము" అని తెలిపారు.