Loading...
IPO: ఈ వారంలో ఐపీఓల జోరు.. 11 కంపెనీల ఇష్యూలతో మార్కెట్లో సందడి.. రూ.7,055 కోట్లు
ఈ వారంలో ఐపీఓల జోరు.. 11కంపెనీల ఇష్యూలతో మార్కెట్లో సందడి.. రూ.7,055 కోట్లు

IPO: ఈ వారంలో ఐపీఓల జోరు.. 11 కంపెనీల ఇష్యూలతో మార్కెట్లో సందడి.. రూ.7,055 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలతో మార్కెట్లోకి రాగా.. ఈ వారంలో మరో 11 సంస్థలు తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్స్‌తో ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ఈ ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు కలిపి రూ.7,055 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబరు 7 నుంచి 15వ తేదీ మధ్య ఈ ఐపీఓలు మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ఎక్కువ ఇష్యూల సబ్‌స్క్రిప్షన్‌ మంగళ, బుధవారాల్లో ప్రారంభం కానుంది. దీంతో ప్రాథమిక మార్కెట్లో ఈ వారం మరింత సందడి నెలకొనే అవకాశం ఉంది.

వివరాలు 

వివిధ రంగాలకు చెందిన కంపెనీలు

ఐపీఓలకు రానున్న సంస్థల్లో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ఇంజనీరింగ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ఉన్నాయి.

వీటితో పాటు పేమెంట్స్‌, ఐడెంటిటీ సొల్యూషన్స్‌ అందించే సంస్థ, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ కంపెనీ, ఆన్‌లైన్‌ రెంటల్‌ ప్లాట్‌ఫామ్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ కొత్త ఇష్యూలు పూర్తయితే.. 2026లో ఇప్పటివరకు వచ్చిన ఐపీఓల సంఖ్య 75కు చేరనుంది. కాగా, ఒక్క ఆగస్టు నెలలోనే 23 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలతో మార్కెట్లోకి వచ్చాయి.

వివరాలు 

ఈ నెల 7-10 మధ్య ప్రారంభమయ్యే ఐపీఓలు

కంపెనీ | ప్రైస్‌బ్యాండ్‌:

ప్రణవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ | రూ.118-124

కనోహర్‌ ఎలక్ట్రికల్స్‌ | రూ.601-632

ప్రసోల్‌ కెమికల్స్‌ | రూ.643-676

గ్లాస్‌వాల్‌ సిస్టమ్స్‌ (ఇండియా) | రూ.172-182

రెంటోమోజో | రూ.384-404

మణిపాల్‌ పేమెంట్‌ | రూ.322-339

ఆర్సిల్‌ | రూ.132-139

ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ | రూ.139-146

కరమ్‌తారా ఇంజనీరింగ్‌ | రూ.241-254

వీగాలాండ్‌ డెవలపర్స్‌ | రూ.130-140

ADVERTISEMENT