Loading...
Stock market: మూడు రోజుల్లో 3,000 పాయింట్లు.. సెన్సెక్స్ ర్యాలీకి కారణాలివే!
మూడు రోజుల్లో 3,000 పాయింట్లు.. సెన్సెక్స్ ర్యాలీకి కారణాలివే!

Stock market: మూడు రోజుల్లో 3,000 పాయింట్లు.. సెన్సెక్స్ ర్యాలీకి కారణాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని సెషన్లలో భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు పెరిగింది. కొంతకాలంగా భారత మార్కెట్లలో అమ్మకాలు కొనసాగించిన విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. నవంబర్ 2, 3 తేదీల్లోనే సెన్సెక్స్ వరుసగా 1,233, 1,225 పాయింట్లకు పైగా లాభపడింది.

వివరాలు 

23,800 పాయింట్లను దాటిన నిఫ్టీ

సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా భారీగా పుంజుకుంది. సోమవారం 23,440.80 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ.. మంగళవారం 23,810.85 పాయింట్లకు చేరింది.

దీంతో 23,800 పాయింట్ల మార్కును దాటింది. అంచనాలకు మించిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు కూడా ఈ ర్యాలీకి తోడ్పడ్డాయి.

అయితే, మార్కెట్లలో ఈ మార్పునకు ప్రధాన కారణం విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కావడమే.

వివరాలు 

మళ్లీ కొనుగోలుదారులుగా మారిన విదేశీ మదుపర్లు

నవంబర్ 3న విదేశీ సంస్థాగత మదుపర్లు భారత ఈక్విటీల్లో రూ.6,836.81 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

అంతకుముందు నవంబర్ 2న రూ.3,114.68 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్ 30న కూడా రూ.3,598.54 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

ఈ మూడు సెషన్లలో కలిపి దాదాపు రూ.13,550 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఏడాది మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ మదుపర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం మార్కెట్‌కు ఊరటనిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

విదేశీ మదుపర్ల వైఖరిలో మార్పుతో మార్కెట్లకు ఊపు

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ.. విదేశీ మదుపర్ల వైఖరిలో వచ్చిన మార్పే మార్కెట్లలో సానుకూల పరిస్థితులకు ప్రధాన కారణమని తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, భారత్‌పై విదేశీ మదుపర్ల వైఖరి ఒక్కసారిగా మారడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

కంపెనీల బలమైన ఆర్థిక ఫలితాలు, ఆకర్షణీయమైన షేర్ల విలువలు కూడా ఈ ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నాయని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

విదేశీ పెట్టుబడుల రాకతో తగ్గిన అమ్మకాల ఒత్తిడి

విదేశీ మదుపర్లు భారత మార్కెట్లలో షేర్లను విక్రయించడం గత కొంతకాలంగా మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.

తాజాగా వారు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో ఆ ఒత్తిడి కొంత తగ్గింది.

ఇదే సమయంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటంతో, ఇటీవల మార్కెట్లలో వచ్చిన పతనం తర్వాత దేశంలోని ప్రముఖ కంపెనీల షేర్ల విలువలపై మదుపర్లు మరోసారి అంచనాలు వేస్తున్నారు.

వివరాలు 

మూలధన లాభాల పన్నుపై చర్చ.. ఎఫ్‌ఐఐల పెట్టుబడులకు ఊతం?

విదేశీ మదుపర్ల పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో దేశంలో మూలధన లాభాల పన్ను విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

విదేశీ ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించాలని సెబీ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.

బడ్జెట్‌కు ముందు సెబీ చేసిన సిఫార్సుల్లో ఇది ఒకటి. అయితే, ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి తప్పనిసరి కావు.

తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించినప్పటికీ, పన్ను తగ్గింపుపై ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

ADVERTISEMENT