Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు
రామ మందిర ప్రారంభోత్సవం అయోధ్య రూపురేఖలను మారుస్తుందన్న అంచనాలను వెలువడుతున్నాయి. అయోధ్య భారత్‌కు ఒక కొత్త పర్యాటక హాట్‌స్పాట్‌ను మారనుంది. తద్వారా ఏడాదికి అయోధ్య నగరం ఏటా 5 కోట్ల మంది పర్యాటకులను అకర్షించనున్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. కొత్త విమానాశ్రయం నిర్మాణం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్లు, టౌన్‌షిప్‌లు, మెరుగైన రహదారి కనెక్టివిటీ మొదలైన వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు10 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. మౌలిక సదుపాయాల పరంగా భారీగా అభివృద్ధి చెందిన అయోధ్యకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతారని జెఫరీస్ పేర్కొంది.
పెరగనున్న పర్యాటక జీడీపీ
భారత పర్యాటకం 2019 ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి 194 బిలియన్ డాలర్లను అందించింది. ఇప్పుడు అది 2033 నాటికి 8 శాతం సీఏజీఆర్ పెరిగి.. 443 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం భారత జీడీపీలో టూరిజం వాటా 6.8 శాతంగా ఉంది. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి వల్ల ఈ పురాతన నగరాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారడానికి అవకాశం ఉన్నట్లు 'జెఫరీస్' పేర్కొంది. అయోధ్యకు పెరుగుతున్న రవాణా పెరగడం వల్లహోటల్స్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఎఫ్‌ఎంసీజీ, ట్రావెల్ యాక్సెసరీస్, సిమెంట్ మొదలైన అనేక రంగాలు లాభపడతాయని 'జెఫరీస్' నివేదిక పేర్కొంది.