Loading...
8th Pay Commission: నేడు బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక భేటీ.. జీతాలు ఎంత పెరగొచ్చు?
నేడు బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక భేటీ.. జీతాలు ఎంత పెరగొచ్చు?

8th Pay Commission: నేడు బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక భేటీ.. జీతాలు ఎంత పెరగొచ్చు?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘం కీలక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులో అక్టోబర్ 7 నుంచి రెండు రోజుల పాటు వివిధ ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలతో ప్యానెల్ సంప్రదింపులు నిర్వహించనుంది. అక్టోబర్ 8న బెంగళూరు సమావేశాలు పూర్తయ్యాక.. కమిషన్ బృందం అక్టోబర్ 22, 23 తేదీల్లో ముంబైలో సమావేశం కానుంది.

వివరాలు 

సమగ్ర నివేదిక దిశగా కసరత్తు

బెంగళూరులో జరగనున్న సమావేశాలకు సంబంధించిన నిర్దిష్ట ఎజెండాను కమిషన్ అధికారికంగా వెల్లడించలేదు.

అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సంప్రదింపుల్లో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్యానెల్ ముందు ఉంచుతున్నాయి.

ముఖ్యంగా వేతనాల పెంపు, పింఛన్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఉద్యోగుల మనోధైర్యం, ఇతర సర్వీసు సంబంధిత అంశాలపై వినతిపత్రాలు సమర్పిస్తున్నాయి.

మరోవైపు 8వ వేతన సంఘం తన నివేదికను సిద్ధం చేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల నుంచి ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోంది.

వివరాలు 

సమగ్ర నివేదిక దిశగా కసరత్తు

జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఈ ప్యానెల్.. ఉద్యోగులు, పింఛనుదారులు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన డేటాను సమగ్రంగా విశ్లేషించనుంది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సవరించిన వేతన నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై తుది సిఫార్సులు చేసే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్‌కు సుమారు 18 నెలల కాలపరిమితి ఉంది. ఈ నేపథ్యంలో 2027 మే-జూన్ నాటికి తుది నివేదికను సమర్పించే అవకాశముంది.

ADVERTISEMENT

వివరాలు 

జీతాల పెంపులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం

8వ వేతన సంఘం అమలులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ది కీలక పాత్ర. ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్న ప్రాథమిక వేతనాన్ని నిర్దిష్ట ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారా కొత్త ప్రాథమిక వేతనాన్ని నిర్ణయిస్తారు.

6వ వేతన సంఘంలో 1.86, 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను ప్రామాణికంగా తీసుకున్నారు.

అయితే 8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రకటించలేదు.

అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు, వాటి ఆధారంగా లెక్కిస్తున్న వేతనాలు కేవలం అంచనాలుగానే పరిగణించాలి.

ADVERTISEMENT

వివరాలు 

లెవెల్ 6, 7, 8 ఉద్యోగుల వేతనాలు ఎలా మారొచ్చు?

ప్రస్తుతం 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. లెవెల్ 6 ఉద్యోగికి కనిష్ఠ ప్రాథమిక వేతనం రూ.35,400గా ఉంది.

లెవెల్ 7 ఉద్యోగికి రూ.44,900, లెవెల్ 8 ఉద్యోగికి రూ.47,600గా ఉంది. 8వ వేతన సంఘం అధికారికంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేసే వరకు ఈ మొత్తాలను ప్రస్తుత ప్రాథమిక వేతనాలుగానే చూడాలి.

ఒకవేళ 7వ వేతన సంఘంలో ఉన్న 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌నే కొనసాగిస్తే.. లెవెల్ 8 ఉద్యోగి ప్రాథమిక వేతనం ప్రస్తుతం ఉన్న రూ.47,600 నుంచి అంచనాగా రూ.1,22,332కు చేరే అవకాశం ఉంటుంది.

వివరాలు 

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మరింత పెంచాలని పలు కేంద్ర ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్సీ-జేసీఎం) ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833కు పెంచాలని ప్రతిపాదించింది.

ద్రవ్యోల్బణం,జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఈ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది.

ఎన్సీ-జేసీఎం ప్రతిపాదన అమలైతే లెవెల్ 1 ఉద్యోగి కనిష్ఠ ప్రాథమిక వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెరిగే అవకాశం ఉంటుంది.

ఇక మరో ప్రధాన ఉద్యోగ సంఘమైన భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్(బీపీఎంఎస్)4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తోంది.

ఈ ప్రతిపాదన అమలైతే లెవెల్ 1 ఉద్యోగి కనీస ప్రాథమిక వేతనం రూ.72,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

వివరాలు 

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు

అయితే ఇవన్నీ ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లు మాత్రమే. వీటికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించలేదు.

కమిషన్ తన నివేదికను సమర్పించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా చెప్పే మొత్తాలు కేవలం ప్రాథమిక వేతనానికి సంబంధించిన అంచనాలు మాత్రమే.

ఉద్యోగి చేతికి వచ్చే తుది జీతం మాత్రం భత్యాలు, మినహాయింపులు, కొత్త పే మ్యాట్రిక్స్ నిబంధనలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ADVERTISEMENT