LOADING...
8th Pay Commission demands:  8వ వేతన సంఘం.. భారీ జీతాల పెంపు, పెన్షన్ సంస్కరణలపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు
8వ వేతన సంఘం.. భారీ జీతాల పెంపు, పెన్షన్ సంస్కరణలపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు

8th Pay Commission demands:  8వ వేతన సంఘం.. భారీ జీతాల పెంపు, పెన్షన్ సంస్కరణలపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు వేగం పుంజుకున్నాయి. జీతాలు,పెన్షన్లు, అలవెన్సుల్లో భారీ మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఎన్‌సీజేసీఎం, మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్‌, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌ తమ ప్రతిపాదనలు సమర్పించాయి. కనీస మూల వేతనం రూ.65 వేల నుంచి రూ.69 వేల వరకు పెంచాలని కోరాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.8 నుంచి 3.833 వరకు నిర్ణయించాలని సూచించాయి.

వివరాలు 

మే 13, 14 తేదీల్లో ఢిల్లీలో వేతన సంఘం కీలక సమావేశాలు

ప్రతి ఏడాది 5 నుంచి 6 శాతం వరకు ఇన్‌క్రిమెంట్లు ఇవ్వాలని అభిప్రాయపడ్డాయి. పెన్షన్ వ్యవస్థలో సంస్కరణలు, డీఏ పెంపు, హెచ్‌ఆర్ఏ, ట్రావెల్ అలవెన్సుల పెంపుపైనా ప్రధానంగా డిమాండ్లు వచ్చాయి. డిఫెన్స్ ఉద్యోగులకు ప్రత్యేక రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలని ఏఐడీఈఎఫ్ కోరింది. మరోవైపు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్‌ ఒత్తిడి తీసుకొస్తోంది. వచ్చే పదేళ్ల జీతభత్యాల నిర్మాణాన్ని నిర్ణయించే ఈ వేతన సంఘం కీలక సమావేశాలు మే 13, 14 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి.

Advertisement