Page Loader
Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌ తన అధికారంలోకి రాగానే మెక్సికో, కెనడా, చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానని ప్రకటించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్య సంబంధాలలో మార్పులు వస్తాయనే ఆందోళనలతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 80,415.47 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది.

Details

నష్టాల్లో అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా

చివరకు 105.79 పాయింట్ల నష్టంతో 80,004.06 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.33గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టపోయాయి. కానీ ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద కొనసాగుతుంది, బంగారం ఔన్సు ధర 2,629 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.