Airtel Digital Head: ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ కంపెనీకి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో నాయర్ రాజీనామా చేసినట్లు ఎయిర్‌టెల్ పేర్కొనడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ రాజీనామా చేసినట్లు తాము తెలియజేస్తున్నమని,అతని రాజీనామా నవంబర్ 3, 2023న ఆమోదించబడిందని ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్ పేర్కొంది.
ఫిబ్రవరి 15న నాయర్ విధుల నుంచి రిలీవ్ అవుతారని చెప్పింది. నాయర్ ఐదు సంవత్సరాల క్రితం ఎయిర్‌టెల్‌లో చేరారు. నాలుగు నెలల క్రితం ఎయిర్‌టెల్ డిజిటల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.
స్టాక్
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఒకలా.. కంపెనీ వెబ్‌సైట్‌లో మరోలా..
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో నాయర్ పొజిషన్‌ను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా కంపెనీ పేర్కొంది. అయితే కంపెనీ వెబ్‌సైట్ అతని పేరు డైరెక్టర్, ఎయిర్‌టెల్ డిజిటల్ అని పేర్కొంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ యాడ్స్, ఎయిర్‌టెల్ ఐక్యూ, వింక్ మ్యూజిక్, ఎక్స్‌స్ట్రీమ్ వీడియోలకు నాయర్ హెడ్‌గా ఉన్నారు.
నాయర్ వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికాకు తిరిగి వెళ్లాలనే ఆలోచనతో రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది.
కంపెనీలో టాప్ పొజిషన్లలో ఉండే కీలక అధికారుల రాజీనామాల్లో నాయర్‌ది రెండోది. ఎయిర్‌టెల్ బిజినెస్ సీఈఓ అజయ్ చిట్కారా జూన్ 2023లో రాజీనామా చేశారు.
ఆగస్టు 2023 వరకు ఆయన పదవిలో కొనసాగారు. సెప్టెంబర్ 1న ఈకామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా చిట్కారా చేరారు.