LOADING...
Tobacco and Pan masala: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఫిబ్రవరి 1 నుంచి అమలు

Tobacco and Pan masala: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాన్‌మసాలా, సిగరెట్లు, పొగాకు తదితర ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ, బీడీలపై 18 శాతం జీఎస్టీను కేంద్రం విధిస్తోంది. దీనితో పాటు పాన్‌మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్సు పెంపు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకంను కూడా అమలు చేయనుంది. ఈ అన్ని కొత్త పన్నులు ఫిబ్రవరి 1 నుంచే వర్తించనున్నాయి.

వివరాలు 

తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సెస్సు వసూలు 

పాన్‌మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్సు విధించడం, అలాగే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా కేంద్రం తీసుకొచ్చిన రెండు బిల్లులను పార్లమెంట్ డిసెంబర్‌లో ఆమోదించింది. 'హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025'పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పాన్‌మసాలాపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ అమలులో ఉందని, దీనికి అదనంగా సెస్సు విధిస్తున్నామని తెలిపారు. తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సెస్సు వసూలు చేస్తామని చెప్పారు. ఈ ద్వారా సమకూరే నిధులను జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్య పరిరక్షణకు వినియోగిస్తామని వెల్లడించారు.

వివరాలు 

ఐటీసీ షేర్లకు దెబ్బ 

కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రభావంతో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరగనున్న నేపథ్యంలో అమ్మకాలు తగ్గవచ్చన్న అంచనాలతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. దీంతో బీఎస్‌ఈలో ఐటీసీ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మరోవైపు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేరు దాదాపు 10 శాతం వరకు పడిపోయింది.

Advertisement