Aditya Birla: ఆదిత్య బిర్లా మొత్తం మార్కెట్ విలువ 8,51,460.25 కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ విజయవంతంగా $100 బిలియన్ల మార్కును అధిగమించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో నమోదైన మొత్తం మార్కెట్ విలువ 8,51,460.25 కోట్లతో శుక్రవారం ఈ ఆర్థిక మైలు రాయిని సాధించింది. దీంతో సమూహంలో ఉన్న పలు ప్రముఖ కంపెనీలు లాభించాయి . వీటిలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హిందాల్కో , వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించింది సమూహం మార్కెట్ క్యాప్ వృద్ధి బెంచ్‌మార్క్ సూచీలు గణనీయంగా లాభ పడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలను ఏడాది నుండి తేదీ ప్రాతిపదికన మెరుగైన వృద్ధి సాధించాయి. అలాగే ఒక ఏడాదిలో, మూడు ఏళ్లు, ఐదు సంవత్సరాల వ్యవధిలో అధిగమించి రికార్డు సృష్టించాయి.
"US డాలర్ పరంగా, ABG యొక్క మార్కెట్ క్యాప్ వృద్ధి
"US డాలర్ పరంగా, ABG యొక్క మార్కెట్ క్యాప్ వృద్ధి ఒక సంవత్సరం మూడు సంవత్సరాల వ్యవధిలో అనూహ్యంగా వృద్ధి సాధించింది. దీనిని S&P కంటే రెట్టింపుగా ఉండి ఆదిత్య బిర్లా గ్రూప్ అంచనాలను దాటేసింది. ఇది దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లలో సమ్మేళనం బలమైన పనితీరును సూచించడం మంచి పరిణామంగా ఈ గ్రూపు భావిస్తోంది. వ్యక్తిగత కంపెనీ మార్కెట్ క్యాప్స్‌లో గణనీయమైన వృద్ధి కొనసాగింది . దీని ప్రభావంతో ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని అనేక కంపెనీలు బాగా లబ్ధి పొందాయి. తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో గణనీయమైన వృద్ధిని సాధించాయి.
కొత్త హై-గ్రోత్ వెంచర్లతో $19 బిలియన్ల వ్యాపారం
కొత్త హై-గ్రోత్ వెంచర్ల కారణంగా గ్రాసిమ్ మార్కెట్ క్యాప్ గత మూడు సంవత్సరాలలో $19 బిలియన్లకు పైగా పెరిగింది. అదేవిధంగా, హిండాల్కో మార్కెట్ క్యాప్ కూడా రెండేళ్లలోపే రెండింతలు పెరిగింది. గత 12 నెలల్లోనే $7 బిలియన్లకు పైగా జోడించారు.గ్రూప్ కు అనుబంధంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచి లాభాలను పొందింది. దీంతో పాటు వోడాఫోన్ ఐడియా ,సెంచరీ టెక్స్‌టైల్స్ మంచి ఫలితాలు చూపాయి. ఒక్క సంవత్సరంలోనే తమ మార్కెట్ క్యాప్‌లను మరింత పెంచుకున్నాయి. దీనితో దాదాపు మూడు రెట్లు పెంచుకోవడం మార్కెట్ కు మరింత బలాన్ని సమకూర్చాయి.