Loading...
Oracle CFO Hilary Maxson: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు సీఎఫ్‌వో సూచనలు
ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు సీఎఫ్‌వో సూచనలు

Oracle CFO Hilary Maxson: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు సీఎఫ్‌వో సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెక్‌ సంస్థ ఒరాకిల్‌ (Oracle)లో మంగళవారం భారీగా ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒరాకిల్‌ సీఎఫ్‌వో హిల్లరీ మాక్స్‌సన్‌ (Hilary Maxson) కీలక సూచనలు చేశారు. కంపెనీ ఆర్థిక వృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 'ఆల్‌ హ్యాండ్స్‌' సమావేశంలో మాట్లాడిన హిల్లరీ మాక్స్‌సన్‌.. సంస్థ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే సమయం, డబ్బును ఆలోచనాత్మకంగా వినియోగించాలని సూచించారు. అయితే, తక్కువ వనరులతో ఎక్కువ పని చేయాలని తాను చెప్పడం లేదని ఆమె స్పష్టం చేశారు.

వివరాలు 

20 వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్

వినియోగదారులకు పెద్దగా ఉపయోగపడని పనులపై కాకుండా.. అత్యధిక ప్రయోజనం చేకూర్చే అంశాలపై దృష్టి సారించాలని ఉద్యోగులకు సూచించారు.

కంపెనీ వృద్ధి, వినియోగదారుల డిమాండ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రభావం వంటి పలు అంశాలను ఆమె సమావేశంలో ప్రస్తావించారు.

సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో హిల్లరీ మాక్స్‌సన్‌ ఉద్యోగుల తొలగింపుల గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్‌.. లేఆఫ్‌ జాబితాలో ఉన్న మరికొందరిని మంగళవారం తొలగించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT