Page Loader
ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 
ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ

ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 

వ్రాసిన వారు Stalin
May 30, 2023
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో విమానయాన రంగ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటికే 470 విమానాలను ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఎయిర్ ఇండియా భారీగా నియామకాలను చేపడుతోంది. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బందిని, 50 మంది పైలట్‌లను నియమించుకుంటుందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్‌ను లాభాల బాట పట్టించొచ్చనే యాజమాన్యం భావిస్తోంది.

విమానం

అప్పటి వరకు నియామకాలు జరుగూనే ఉంటాయ్: సీఈఓ

కొత్త విమానాలు వస్తున్న కొద్దీ నియామకాలు పెరుగుతూనే ఉంటాయని సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు నియామకాలు చేపడుతాని వివరించారు. అలాగే 2024 చివరి నాటికి మళ్లీ నియామకాలు వేగం పుంజుకుంటాయని వెల్లడించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారాలను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే ప్రక్రియ రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం నాలుగు ఎయిర్‌లైన్స్‌లో కలిపి 20వేల మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే కొత్తగా నియమిస్తున్నవారు అదనం అన్నారు.