Loading...
Saudi Arabia: నవంబర్‌ 7 వరకు సౌదీకి విమాన సర్వీసులు రద్దు..
నవంబర్‌ 7 వరకు సౌదీకి విమాన సర్వీసులు రద్దు..

Saudi Arabia: నవంబర్‌ 7 వరకు సౌదీకి విమాన సర్వీసులు రద్దు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. దీంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు సౌదీ అరేబియాకు వెళ్లే పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే విమానాలను నవంబర్ 7 వరకు, జెడ్డాకు వెళ్లే సర్వీసులను అక్టోబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అక్టోబర్ 24వ తేదీలోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఉచితంగా ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం కల్పించాయి. లేదంటే టికెట్‌కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించాయి.

వివరాలు 

ఉమ్రా యాత్రకు వెళ్లినవారికి ఇబ్బందులు

మరోవైపు, ఇండిగో సంస్థ కూడా జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు నడిచే విమాన సర్వీసులను అక్టోబర్ 31 వరకు రద్దు చేసింది.

ఆకాశ్ ఎయిర్ సైతం జెడ్డాకు వెళ్లే విమానాలను నవంబర్ 10 వరకు, రియాద్‌కు వెళ్లే సర్వీసులను నవంబర్ 30 వరకు నిలిపివేసింది.

ఈ నిర్ణయంతో సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా ఉమ్రా యాత్రకు వెళ్లినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు జెడ్డాలోని భారత కాన్సులేట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వివరాలు 

ప్రయాణికులకు సహాయంగా కంట్రోల్ రూమ్‌లు

విమాన సర్వీసుల రద్దుతో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం జెడ్డాలోని భారత కాన్సులేట్ 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితులకు ఆహారం, మందులు అందిస్తోంది.

అలాగే, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అందిస్తోంది.

ప్రయాణికులు తమ విమానాల తాజా పరిస్థితిని సంబంధిత విమానయాన సంస్థల ద్వారా తెలుసుకుని, తదనుగుణంగా ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT