మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్
కోవిడ్‌తో కుదేలైన దేశీయ విమానయాన పరిశ్రమ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది మార్చితో పోలిస్తే, 2023 మార్చిలో విమాన ప్రయాణాలు భారీగా పెరిగాయి. ప్రయాణీకుల రద్దీ 21.4% పెరగడం గమనార్హం. ముఖ్యంగా జనవరి-మార్చి త్రైమాసికంలో ఇండిగో ఎయిర్ లైన్స్ దేశీయ ఎయిర్ ట్రాఫిక్ ఏకంగా 51% పెరిగి ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ప్రయాణీకుల రద్దీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 51.7% పెరిగింది.
మార్కెట్ వాటా 8.8శాతంతో రెండో స్థానంలో ఎయిర్ ఇండియా
2022 మార్చిలో కోటి మంది ప్రయాణిస్తే, 2023 మార్చిలో దాదాపు 1.3 కోట్ల మంది ఇండిగో దేశీయ విమానాల్లో ప్రయాణించారు. మార్చిలో ఇండిగో మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగినా, 56.8శాతంతో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 8.8శాతానికి పడిపోయినప్పటికీ అది రెండో స్థానంలో ఉంది. టాటా యాజమాన్యంలోని విస్తారా 8.7% వాటాతో మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది. ఆర్థికంగా చితికిపోయిన రెండు విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, గో ఫస్ట్ వాటి మార్కెట్ షేర్లు మరింత తగ్గిపోయాయి. టాటా ఎయిర్ ఇండియా, విస్తారా కలిసినా ఇండిగోను అధిగమించకపోవడం గమనార్హం.