Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్
ప్రముఖ అతిపెద్ద టెలికాం సంస్థ 'ఎయిర్ టెల్' తన వినియోగదారులకు షాకిచ్చింది. రెండు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసింది. 'ఎయిర్‌టెల్' కంపెనీ తన రూ. 118 ప్లాన్‌తో పాటు రూ. 289 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను సవరించింది. ఈ మేరకు కొత్త ధరలను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఎయిర్‌టెల్ రూ.118 ప్లాన్‌ను ఇప్పుడు రూ.129 ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 289 ప్లాన్‌ను రూ. 329 ధరకు విక్రయించబోతోంది. ఈ రెండు కూడా 4జీ ప్లాన్స్ కావడం గమనార్హం. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వినియోగదారులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఓసారి పరిశీలిద్దాం.
ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్ 12GB ఇంటర్నెట్ డేటాతో వస్తుంది. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటులో ఎప్పుడైనా ఈ డేటాను ఉపయోగించవచ్చు. ఈ 12 GB డేటా చెల్లుబాటు వినియోగదారుల ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వలే ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఇతర ప్రయోజనాలను పొందలేరు. రూ.329 ప్లాన్ గతంలో ఈ ప్లాన్ ధర రూ.289గా ఉండేది. ఈ ప్లాన్ వ్యాలిడిటీని వినియోగదారులు 35 రోజుల వరకు ఉంటుంది. ఇందులో, వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 4GB డేటా, 300 SMS సౌకర్యాన్ని పొందుతారు. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో, వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Airtel థాంక్స్ సౌకర్యాన్ని పొందుతారు.