LOADING...
Anant Ambani: గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న అనంత్ అంబానీ, ఈ అవార్డును అందుకున్న  మొదటి ఆసియా విజేత..
ఈ అవార్డును అందుకున్న  మొదటి ఆసియా విజేత..

Anant Ambani: గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న అనంత్ అంబానీ, ఈ అవార్డును అందుకున్న  మొదటి ఆసియా విజేత..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్యప్రాణుల సంరక్షణ రంగంలో అసాధారణమైన సేవలు అందించినందుకు వంతారా కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి, గ్లోబల్ హ్యూమానిటేరియన్ సొసైటీ "గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్" ను ప్రదానం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం సాధించడం ద్వారా, ఈ పురస్కారాన్ని పొందిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా, అలాగే తొలి ఆసియా వ్యక్తిగా అనంత్ అంబానీ ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షణ నిపుణులు, యానిమల్ వెల్ఫేర్ రంగ నాయకుల సమక్షంలో ఈ అవార్డును ఆయనకు అందజేశారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా జంతువులు, ప్రకృతిపై జీవితాంతం నిబద్ధత చూపిన వ్యక్తులకు ఈ అవార్డు 

జంతువులు, ప్రకృతి పరిరక్షణ కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వ్యక్తులను ఈ అవార్డు ద్వారా గుర్తిస్తామని గ్లోబల్ హ్యూమన్ సొసైటీ తెలిపింది. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా, స్పష్టమైన ఆధారాలు ఉన్న విధానాలతో సంరక్షణ కార్యాచరణను కొనసాగిస్తున్నందుకుగానూ అనంత్ అంబానీకి ఈ గౌరవం దక్కింది. ఆయన కార్యక్రమాలలో జంతు రక్షణ పనులు, గాయపడిన జీవుల సంరక్షణతో పాటు పునరావాసం, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, సైన్స్ ఆధారిత సంరక్షణ ప్రాజెక్టులు, ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణకు చేపట్టిన విస్తృత కార్యాచరణ ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఆయన నాయకత్వంలో కొనసాగుతున్న వంతారా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సమగ్రమైన, ఫలప్రదమైన పరిరక్షణ కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

వివరాలు 

ప్రతి జీవికి గౌరవం, సంరక్షణ, ఆశను అందించడమే వంతార ప్రధాన లక్ష్యం

అవార్డు స్వీకరించిన అనంతరం అనంత్ అంబానీ మాట్లాడుతూ, "గ్లోబల్ హ్యూమన్ సొసైటీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జంతువులు మనకు సమతుల్యత, వినయం, విశ్వాసం వంటి విలువలను నేర్పుతాయి. ప్రతి జీవికి గౌరవం, సంరక్షణ, ఆశను అందించడమే వంతార ప్రధాన లక్ష్యం" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అధ్యక్షుడు, సీఈఓ రాబిన్ గాంజెర్ట్ మాట్లాడుతూ, "వంతారా కేవలం జంతు రక్షణ కేంద్రం మాత్రమే కాదు... అది చికిత్స, పునరావాసం అందించే ఒక స్వర్గధామం. అనంత్ అంబానీ నాయకత్వం జంతు సంరక్షణ రంగంలో కరుణ, దయతో కూడిన కొత్త అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పింది. వంతారాను ప్రపంచంలోని అత్యంత కీలకమైన జంతు సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతోంది," అని ప్రశంసించారు.

Advertisement