Loading...
Bisleri FSSAI Action: బిస్లెరీకి మరో షాక్.. నీటిలో బ్యాక్టీరియా కలకలం!
బిస్లెరీకి మరో షాక్.. నీటిలో బ్యాక్టీరియా కలకలం!

Bisleri FSSAI Action: బిస్లెరీకి మరో షాక్.. నీటిలో బ్యాక్టీరియా కలకలం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లెరీ ఇంటర్నేషనల్‌పై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి చర్యలకు దిగింది. పశ్చిమ బెంగాల్‌లోని సంస్థ ప్లాంట్‌ నుంచి సేకరించిన నీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కొత్తగా ప్రాసిక్యూషన్ ప్రారంభించింది. రెండు వేర్వేరు ప్రయోగశాలలు కూడా ఈ బ్యాక్టీరియా ఉనికిని ధ్రువీకరించడంతో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 కింద చర్యలు చేపట్టింది.

వివరాలు

జల్పాయిగురి ప్లాంట్‌లో కలుషిత నీటి నమూనా

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా టెలిపారా గ్రామంలో ఉన్న బిస్లెరీ తయారీ కేంద్రం నుంచి అధికారులు నీటి నమూనాలను సేకరించారు.

ప్రాథమిక ఆహార పరీక్షా ప్రయోగశాల, రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీ రెండూ ఆ నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారించాయి.

మురుగునీటి పైపుల లీకేజీలు, దెబ్బతిన్న పైపుల వంటి కారణాలతో ఈ తరహా బ్యాక్టీరియా నీటి వ్యవస్థల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో PB 201 బ్యాచ్‌ నీటి బాటిళ్ల విక్రయాలను 2026 ఆగస్టు 12న నిషేధించారు.

వివరాలు

గోవా ప్లాంట్‌పైనా గతంలో చర్యలు

బిస్లెరీపై తాజాగా చర్యలు తీసుకోవడానికి కొద్ది రోజుల ముందే.. గోవాలోని సంస్థ ప్లాంట్‌కు సంబంధించిన మరో కేసులోనూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది.

అక్కడి నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో నిర్దేశించిన పరిమితులకు మించి బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారు.

దీంతో ఆ నీటిని ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం వినియోగానికి సురక్షితం కానిదిగా ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు

పరీక్షల ఫలితాలపై బిస్లెరీ అప్పీల్

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గతంలో వెల్లడించిన పరీక్షా ఫలితాలపై బిస్లెరీ అప్పీల్ చేసింది. దీంతో ఆ నీటి నమూనాను రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు.

అక్కడ కూడా పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించి.. ఆ నమూనాను సురక్షితం కానిదిగా ప్రకటించారు.

దీంతో కలుషిత ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై బిస్లెరీ ఇంటర్నేషనల్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాసిక్యూషన్ ప్రారంభించింది.

అయితే, తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వినియోగానికి సురక్షితమేనని సంస్థ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు

బాటిల్ వాటర్ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిఘా

మరోవైపు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన తనిఖీలను విస్తరించింది. వివిధ బ్రాండ్లకు చెందిన నీటి బాటిళ్ల నుంచి యాదృచ్ఛికంగా నమూనాలను సేకరిస్తోంది.

బాటిల్ వాటర్ నాణ్యతను నిర్ధారించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం.

దీనితో పాటు ప్రముఖ సంస్థల పేర్లు, లేబుళ్లను పోలిన పేర్లతో ఉత్పత్తులను విక్రయిస్తున్న బ్రాండ్లపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ADVERTISEMENT