Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మరో షాక్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం మరోసారి షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. ఒక రోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెడుతున్నాయి. తాజాగా శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారంపై రూ.2,890 పెరగగా, కిలో వెండిపై రూ.10,000 వరకు ధర ఎగబాకింది. దీంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. తులం బంగారంపై రూ.2,890 పెరుగుదలతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,600 వద్ద ట్రేడవుతోంది.
Details
తులం బంగారంపై రూ.2,650 పెరుగుదల
అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,43,550కు చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,170 పెరిగి రూ.1,17,450 వద్ద విక్రయమవుతోంది. వెండి ధర కూడా భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85,000కు చేరింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ ఇదే ధర వద్ద వెండి ట్రేడవుతోంది. బంగారం, వెండి ధరల్లో వరుస మార్పులతో కొనుగోలుదారులు పరిస్థితిని గమనిస్తూ వేచి చూస్తున్నారు.