LOADING...
Home Loan Tips: ఇల్లు కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే లక్షల్లో నష్టం!
ఇల్లు కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే లక్షల్లో నష్టం!

Home Loan Tips: ఇల్లు కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే లక్షల్లో నష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల. దీనికోసం చాలామంది తమ ఆదాయాన్ని క్రమంగా కూడబెట్టుకుంటారు. అయితే ఇంటి నిర్మాణం లక్షల రూపాయల వ్యయం కావడంతో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు అంత మొత్తాన్ని ఒకేసారి సమకూర్చుకోవడం కష్టమవుతుంది. అందుకే ఎక్కువ మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుని, నెలనెలా ఈఎంఐల రూపంలో చెల్లిస్తుంటారు. సాధారణంగా 20 ఏళ్ల వరకు గడువు ఉండే ఈ రుణాన్ని తీసుకునే సమయంలో కొన్ని తప్పిదాలు చేస్తే, తరువాత లక్షల్లో నష్టం చవిచూడాల్సి వస్తుంది. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

వివరాలు

వడ్డీ రేటు ఎంపికలో జాగ్రత్త

హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఫ్లోటింగ్ లేదా ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లలో మార్పులు చేస్తూ ఉంటుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎంచుకుంటే రెపో రేటు తగ్గినప్పుడు మీ వడ్డీ కూడా తగ్గి ఈఎంఐలు తగ్గుతాయి. అయితే రెపో రేటు పెరిగితే ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఫిక్స్‌డ్ వడ్డీ రేటు తీసుకుంటే రెపో రేటు తగ్గినా మీకు ప్రయోజనం ఉండదు. దీంతో మీరు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

వివరాలు

ప్రీపేమెంట్ ద్వారా లాభం

భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే అవకాశముందని భావిస్తే, మీ రుణంలో కొంత మొత్తాన్ని ముందుగానే (ప్రీపేమెంట్) చెల్లించడం మంచిది. దీంతో అసలు రుణం తగ్గి, దానిపై చెల్లించాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది. అవసరమైతే కొంత కన్వర్షన్ ఛార్జీ చెల్లించి ఫ్లోటింగ్ రేటుకు మారడం కూడా ప్రయోజనకరం. ప్రస్తుతం రెపో రేటు సుమారు 5.25 శాతం వద్ద ఉంది. గత ఏడాదిలో ఇది 1.25 శాతం తగ్గడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేటు ఎంచుకున్న వారికి ఇది లాభదాయకంగా మారింది.

Advertisement

వివరాలు

ఈఎంఐ పెంచితే ప్రయోజనం

మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని కొద్దిగా పెంచడం ద్వారా కూడా లాభం పొందవచ్చు. ఇలా చేయడం వల్ల అసలు రుణం త్వరగా తగ్గి, మొత్తం వడ్డీ భారం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా లోన్ గడువు ముగియకముందే రుణాన్ని పూర్తిగా చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తానికి సరైన వడ్డీ రేటు ఎంపిక, ప్రీపేమెంట్, ఈఎంఐ పెంపు వంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే హోమ్ లోన్ భారం తగ్గించుకోవడంతో పాటు లక్షల్లో డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Advertisement