
ఐదు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం.. ఆగస్టులో -0.52శాతానికి పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారత టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్-2023లో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం గణాంకాలను విడుదల చేసింది.
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం -0.52 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.
డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూలైలో -1.36 శాతంగా నమోదైంది. ఆగస్టులో హోల్‌సేల్ ధరలు పెరిగాయి.
ద్రవ్యోల్బణం రేటు సున్నా కంటే దిగువన ఉన్నప్పటికీ, ఇంధనం, ఎనర్జీ రెట్లు పెరిగిన పరిస్థితి నెలకొంది.
అదేవిధంగా, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో సున్నా కంటే తక్కువగా -2.37 శాతంగా ఉంది.
ఈ కేటగిరీ వస్తువుల ఇండెక్స్ 0.1 శాతం పెరిగింది, ఇది పెరుగుతున్న ధరల ఒత్తిడిని సూచిస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆగస్టులో భారీగా పెరిగిన ధరలు
#Breaking | #August #WPI #inflation at -0.52% vs -1.36% in July
— CNBC-TV18 (@CNBCTV18Live) September 14, 2023
WPI Inflation in negative territory for 5th straight month pic.twitter.com/k4RYyv5QEW