NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bank Holidays: డిసెంబర్'లో ఏకంగా 17 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సమాచారం తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    Bank Holidays: డిసెంబర్'లో ఏకంగా 17 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సమాచారం తెలుసుకోండి
    డిసెంబర్'లో ఏకంగా 17 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సమాచారం తెలుసుకోండి

    Bank Holidays: డిసెంబర్'లో ఏకంగా 17 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సమాచారం తెలుసుకోండి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి బ్యాంకు ఖాతా అవసరం అవుతుంది.

    బ్యాంకులో అనేక సేవలు ఉపయోగపడుతాయి, కానీ డిజిటల్ సాంకేతికత ఉన్నా, కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది.

    చిన్న లావాదేవీలతో పాటు, పెద్ద మొత్తాల ట్రాన్సాక్షన్లు, రుణాల పథకాలు, లేదా ఇతర ప్రభుత్వ సేవల కోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది.

    ఈ తరహా అవసరాలకు వ్యక్తులు తరచూ బ్యాంకులకు వెళ్ళడం వల్ల, బ్యాంకులు ఏ రోజుల్లో పని చేస్తాయో, ఏ రోజుల్లో మూసి ఉంటాయి తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే చివరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

    వివరాలు 

    రాష్ట్రాల వారీగా సెలవలు మారచ్చు 

    సాధారణంగా బ్యాంకులు ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారం రోజుల్లో మూసి ఉంటాయి. అలాగే, పండగల సందర్భాల్లో, ప్రత్యేక సెలవులు కూడా ఉంటాయి.

    డిసెంబర్ నెలలో 17 రోజులపాటు బ్యాంకులు సెలవుల మీద ఉంటాయి.

    కానీ, ఇవి రాష్ట్రాల వారీగా మారవచ్చు. అంటే, కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఎక్కువగా ఉండవచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉండవచ్చు.

    వివరాలు 

    డిసెంబర్ నెల బ్యాంక్ సెలవుల వివరాలు: 

    డిసెంబర్ 1: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 3: శుక్రవారం - గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 8: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 12: మంగళవారం - మేఘాలయాలో ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 16: రెండవ శనివారం - బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 17: ఆదివారం - బ్యాంకులు మూసిపోతాయి.

    డిసెంబర్ 18: బుధవారం - మేఘాలయాలో యూ సోసో థామ్ వర్థంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 19: గురువారం - గోవాలో విమోచన దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    వివరాలు 

    డిసెంబర్ నెల బ్యాంక్ సెలవుల వివరాలు: 

    డిసెంబర్ 22: ఆదివారం - బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 24: మంగళవారం - క్రిస్మస్ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 25: బుధవారం - దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందర్బంగా బ్యాంకులు మూసిపోతాయి.

    డిసెంబర్ 26: గురువారం - మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా బ్యాంకులు మూసిఉంటాయి.

    డిసెంబర్ 27: శుక్రవారం - నాగాలాండ్‌లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 28: నాల్గవ శనివారం - బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 29: ఆదివారం - బ్యాంకులు మూసిపోతాయి.

    డిసెంబర్ 30: సోమవారం - మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    వివరాలు 

    అందుబాటులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్

    డిసెంబర్ 31: మంగళవారం - మిజోరాం, సిక్కింలో నూతన సంవత్సర పండగ, లాసాంగ్, నామ్‌సూంగ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవు.

    డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్యాంకులు మూసిఉంటాయి.

    మిగిలిన రోజుల్లో బ్యాంకులు సాధారణంగా పని చేస్తాయి. డిజిటల్ సేవలు, అందరికీ అందుబాటులో ఉన్న యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు మాత్రం బ్యాంకులు మూసివుండి ఉన్నప్పటికీ అందుబాటులో ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    బ్యాంక్

    భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం
    ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    Credit Card: క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లు క్రెడిట్ కార్డు
    సన్నీ డియోల్ బంగ్లా వేలం నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్‌ విమర్శలు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025